నవతెలంగాణ బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Polls) ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఇక రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను చేపడుతోంది. సీఎం రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రధానంగా పోటీ పడుతుండగా శాసనసభా పక్ష నేత (సీఎల్పీ) ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ హైకమాండ్ ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రభుత్వ ఏర్పాటు, తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై చర్చించేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో బెంగళూర్‌లో ఆదివారం సమావేశం కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
మరి కొద్ది గంటల్లో జరగనున్న శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలతో చర్చించి తదుపరి సీఎంను ఎంపిక చేయనున్నారు. ఇందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బవరియ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భన్వర్ జితేంద్ర సింగ్‌లను పరిశీలకులుగా పంపింది. శాసనసభ పక్ష నేత ఎంపికపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు కట్టబెడుతూ సీఎల్పీ సమావేశం తీర్మానించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ కీలక సమావేశానికి ముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కర్నాటక పరిణామాలపై అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడారు. ఇక సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర వంటి పలువురు పోటీ పడుతున్నారని కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి తెలిపారు. సీఎం పదవి ఒకరినే వరిస్తుందని, సీఎం ఎవరనేది పార్టీ ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయమని, తనకు మాత్రం మంత్రి పదవి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 07:58PM