నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తుఫాన్లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. తుఫాన్ తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో అందులో 11 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm