Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే రేఖానాయక్
నవతెలంగాణ-జన్నారం
కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదని ఎమ్మెల్యే రేఖాశ్యాం నాయక్ అన్నారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డలను సంతోషంగా ఉన్నారన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా అందజేస్తున్న చీరలు చూసి మహిళలు ఎంతో మురిసిపోతున్నారన్నారు. పేదలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ బుచ్చన్న, కోప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, వైస్ చైర్మన్ గోట్ల రాజేష్ యాదవ్, వైస్ ఎంపీపీ సుతారి వినరు కుమార్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీష్, వైస్ చైర్మన్ సిటిమల భరత్ కుమార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మమ్మద్ రియాజుద్దీన్, పొన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీవో అరుణరాణి, ఎంపీఈవో రమేష్, తహసీల్దార్ కిషన్ పాల్గొన్నారు