Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలో బాలల రక్షణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాల రక్ష భవన్ తనీఖీ చేసి బాలల సంరక్షణ విభాగాన్ని, బాలల సంక్షేమ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎంతమంది కోవిడ్ అనాధలు ఉన్నారో వారి సంక్షేమానికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి బాలల సంక్షేమ కమిటీలను బలోపేతం చేయాలని సమావేశాలు కచ్చితంగా నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశాలలో బాలలకు సంబంధించిన సమస్యలను బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, బాలల అపహరణ, కార్మికులు మొదలైన అంశాల పైన సమావేశంలో తప్పనిసరిగా చర్చించి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో అక్రమ దత్తత జరగకుండా నిఘా పెంచాలని, చట్టబద్ధత దత్తతపైన ఎక్కువగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం బాలరక్ష భవన్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు డేవిడ్, సమీరుల్లా ఖాన్, దశరథం, బాల రక్షా భవన్ సిబ్బంది పాల్గొన్నారు.