Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రకరకాల పూలు సమకూర్చి బతకమ్మని పేర్చి తరువాత కళాశాల విద్యార్థులు మహిళా అధ్యాపకురాలు ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ సంబురాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ పి.ఉదరు కుమార్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు గౌరమ్మ పూజతో రకరకాల నైవేద్యాలు సమర్పించి, బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. మన తెలంగాణలో అనువాయితీ అని బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల మనసులో ఉత్సహన్ని నింపే పండుగ అని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కె బాలాజీ, వై తిరుపతిరెడ్డి, లింగంపల్లి సుజాత, దోమకొండ సుజాత, ఎల్ శారదా, ఉదయ రెడ్డి, నరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.