Authorization
Mon May 05, 2025 02:24:38 pm
నిన్నటి పాదముద్రలు చెరిగిపోయాయి.
రాకాసి అలల రాకపోకలతో
తీరమంతా కర్ఫ్యూ!
పున్నమి పువ్వు చెదిరిపోయింది.
చిక్కగా చీకటి వికసిస్తుంటే
ఆకాశమంతా కర్ఫ్యూ!
మొలకెత్తాలనే ఆశ మోడుబారింది.
వేరు కుంపట్లు పెట్టుకున్న వేర్లు వెళ్ళిపోయాయి
నేలమాలిగ అంతా కర్ఫ్యూ!
అహానికి అంతులేని దాహం.
పట్టువిడుపులు లేకుండా పయనిస్తే
మది గదిలో కర్ఫ్యూ!
- కుడికాల వంశీధర్
సెల్ 9885201600