Authorization
Sun May 04, 2025 04:06:31 pm
చిరునామాలు చెరిగిపోతున్నాయి
ఫోన్లో నెంబర్లు వుంటాయి
అవి మూగవైపోతాయి
నెంబర్లని తొలగించచడం ఇష్టం లేదు
వాటిని చూసినప్పుడు
మీ వెచ్చని మాటలు గుర్తు కొస్తూవుంటాయి
ఇక లేరు
అన్న వార్తని విన్నా
చూసినా
కళ్ళు మంచు గడ్డల్లా మారిపోతాయి
చివరగా కూడా
చూడని సందర్భం
ఇంకా చూసినట్టుగా మనస్సు
అప్పుడప్పుడు
మీ నుంచి మ్రోగే ఫొన్
మోగనప్పుడల్లా ..
ఇక లేరు ...ఇక లేరు
అన్న మాటలు మారుమ్రోగుతాయి
ఇక లేరేమోనని అనిపిస్తుంది
అయినా
నా మనస్సులో
మీ చిరునామాలే కాదు
మీ ఆనవాల్లు చెరిగిపోవు
- రాజేందర్జింబో
సెల్: 94404 83001