Authorization
Fri April 11, 2025 03:41:04 am
పేదొళ్ళ ఇంటి ఇలవెల్పై గౌరమ్మనే
బహుజనుల గుండెలలో దేవతై నిలిచింది
బహుజనుల బతుకు దేవత బతుకమ్మ
అనుచబడ్డ తెలంగాణ జాగతిక తారే
అణువణువునా పూలరెమ్మై పూచింది
బతుకమ్మ పూలరెమ్మలు జాగత నేస్తాలు
పెత్తందారీ తనంపై ఎక్కుబెట్టిన బాణమే
బహుజనుల బతుకు చిత్రం బతుకమ్మ
బహుజన ఉద్యమాల ముద్దుబిడ్డ బతుకమ్మ
ఆడబిడ్డల ఎతను వోలకపోస్తూ
బతుకమ్మ ని బోమ్మగా పేర్చుతారు
సుఖ దుఃఖాల వొలపోత బతుకమ్మ పూలబొమ్మ
దాస్య విముక్తి కి ఆదిశక్తి తానై
రేపటి తరాలకు వారధౌతుంది బతుకమ్మ
వీరనారి బతుకమ్మ విజయాల తల్లి
- ఉప్పరి తిరుమలేష్, 9618961384