Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లతాచు నిను తొంగిచూస్తుంది..
నీ కురులు తనలా ఎందుకున్నాయని.
ఎర్రని మందారాలు నీ అధరాలను
అదే పనిగా గమనిస్తున్నాయి.
వీస్తున్న గాలి నిను వాటేసుకుని..
నీ చుట్టే తిరుగుతుంది.
నువ్వు పాదం మోపిన నేల.
నీ అడుగుల శబ్దాన్ని వింటూ మైమరచిపోతుంది.
నీ అందాన్ని చూసి రంగుల సీతాకోకచిలుక..
మకరందంలా నిను జుర్రుకోవాలని..కళలుకంటుంది
నయాగార జలపాతం ..
నీ నడుము ఒంపులనిచూసి..
క్షణకాలం అలా నిలబడి చూస్తుంది.
నీ నడకనుచూసి...
నదులన్నీ నీ వెంటే పరుగులు తీస్తున్నాయి.
రవికిరణాలు నీ అందమైన తనువును తాకి..
చల్లని మంచుగడ్డలై పోతున్నాయి.
వెన్నెల వర్షం కురిపిస్తున్న నెలవంక
నీ చామనలుపు దేహానికి వెండిరంగులు అద్దుతుంది.
చీకటిలో నువ్వు మిణుగురులా మెరుస్తుంటే..
మిణుగురుసైతం ప్రకాశించడం మర్చిపోతుంది.
బంతిపువ్వుల గుంపంతా..
నీ నల్లని కురులలో ఒదిగిపోవాలని చూస్తున్నాయి.
చెలీ.. నా మనసు తలుపులు తెరిచి నిన్నే చూస్తున్నాను.
ఆశల దీపానివై వచ్చి..
తొడునీడవై ఉంటావని.
- అశోక్ గోనె, 9441317361