Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథలెన్నింటినో చెబుతుంది
ఏకకాలంలో
విషాద సౌందర్యభరితాలైన
అమె నయనాల వలెనే !!
అతడు రాస్తాడు
తాను రాసే ప్రతి పదంలో
వెతికే ప్రేమ అమేనని !!
ఆమె కన్నుల్లో లిపి లేని
ఒక భాష దాగుంది
చదవగలిగితే సుదూరాన ఉన్న చుక్కల్తోనూ
మాట్లాడే నేర్పు నీకలవడుతుంది !
ఆమెకో చక్కని తోటుంది
తన హృదయంలో
నీ కోసమే నాటిన
నీ కొరకే వికసించే గులాబీల తోట !!
ఆమె తానెప్పుడూ
పాడుకునే గీతం ఒకటుంది
అర్ధరాత్రి నక్షత్రాలు
వేసవి వాన కలిపి
బాణీ కూర్చిన పాట అది
- హిమజ, 94414 92737