Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నవమానవ లోకం
మన నవమానవ కలాలకోసం
ఎదురు చూస్తోంది.
మానవత్వం వర్సెస్
మతోన్మాదం మధ్య
యుద్ధం సాగుతుంది.
పాతాళంలో కునుకు తీస్తున్న
పాశవిక పాలకులు
మళ్ళి విజృంభిస్తున్నారు.
కులమతాల జోడు పిశాచాలు
మనుషుల మధ్య
ఆరని అగ్గిని రాజేస్తూనే ఉన్నాయి.
మత సంతలో
ఓట్లు లాక్కునీ, నేరగాళ్లు
నేలనెలుతున్నారు.
అభివృద్ధి చెందిన
మన ప్రజాస్వామ్యంలో
మౌనం ప్రశ్న ఐతే
ప్రాణం పాతరేయబడుతుంది.
మానవతా మూల్గల నుండి మతోన్మాదం
జలగల్లా నెత్తురు జుర్రుకుంటుంది.
మత మౌడ్యపు కత్తి కోరలు
కవుల కంఠాల్ని
ఖండిస్తూనే ఉన్నాయి.
ఆకాశమంత ఎత్తుకెదిగినందుకు
పరిహారంగా
తెగ్గొట్టబడుతున్న మేధావుల తలలు..
మంటలై దేశాన్ని దహించి వేస్తాయి.
వంగిన తలలు
పైకి లేస్తున్నాయి.
మానవత్వాన్ని
ఖాళీ చేయిస్తున్న
ఉన్మాదపు బంది పోట్ల గురించి
మానవ లోకానికి ఎరుకచెప్పుతున్నాయి
ఇప్పుడూ.. వేట మారబోతోంది.
రాజు గారు
జంతువులను వేటాడడం కాదు.
జంతువులే రాజు గారిని
వేటాడ బయలు దేరబోతున్నాయి.
మానవత్వం వైపు నిలబడి
మనుషత్వానికి పురుడుపోసి
మనుషులను
పెంచేలా..
కొత్త సంవత్సరం
శుభాకృతిగా మారాలని
కోరుకుందాం!
- మాడుగుల రాములు