Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సడి చేయకే గాలీ
సవ్వడవుతుంది
శ్వాస వినిపించినా,
సంకెళ్ళు వేస్తారు
వెలుగకే వెన్నెల
వాళ్ళ నీడ కనిపిస్తుంది
దొరికి పోయిన వాళ్ళు
నిన్ను బోనులో నిలబెడుతారు
అరవకే పిచ్చుకా
నీవు నిలదీస్తున్నావనుకొంటారు
ఎగిరే రెక్కలున్నందుకు
నిన్ను పంజరంలో పెడతారు
- ఆశారాజు
[email protected]