Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దుపొడవగానే వికసించే
ప్రతిపుష్పంలో నీ చిరుదరహసాన్ని
చూస్తూ నా ఉషోదయాన్ని హుషారుగా
ఖుషీఖుషీగా ప్రారంభిస్తాను..
ఉషోదయ సూర్యబింబం అందమైన
నీ ముఖరావిందాన్ని గాంచి
ఈర్ష్యాద్వేషాలతో కోపతాపాలతో నిప్పులా
ఎర్రగా మారి నా ప్రేమకప్పును కాల్చడానికి
కదిలివస్తున్నాడు..
నీ చిరునవ్వుల అభిమానినై
నీ చిరునామా కోసం
చిరుగాలిలో చిరుదివ్వెనై వెతుకుతూ
సమాజపు ఈదురుగాలులకు
రెపరెపలాడ్తున్నాను..
నడిసంద్రంలో కష్టాలు వాయుగుండమై
నను చుట్టుముట్టితే
నా ప్రేమ గండమును దాటడానికి
నీ జ్ఞాపకాల తెప్పతో తీరం వైపు
చేరడానికి అష్టకష్టాలు పడ్తున్నాను..
నీ జ్ఞాపకాల కాగడను నా తల కింద
తలగడలా పెట్టుకుని
స్వప్నలోకంలో కూడా నిను క్షణకాలానికి
కూడా దూరం చేసుకోలేక వెంటనే అన్వేషించి
నీ దరికి చేరుతాను..
- సర్ఫరాజ్ అన్వర్..
సెల్: 9440981198