Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంత విశ్వంలో అరకొరగా
దొరికే అలనాటి అరుదైన ఆనందాన్ని
ఆకాశమంత అందించిన నేనెవరో
నిచ్చనేసి వంగిన హరివిల్లునందుకొని
తడి కన్నులను తుడిచి
కాంతిని ప్రజ్వలింపజేసి
లోకాన్ని రంగులమయంగా మార్చిన నేనెవరో
ముడుచుకున్న పెదాలకు
అద్భుతమైన అందమైన వెన్నెలను
చిరునవ్వుగా అందించిన నేనెవరో
ఒంటరి ప్రయాణంలో
అరచేతినే తివాచీగా పరిచి
మలినం లేని మల్లెనై
మనసార నీ వెంట నేనున్నానని
ధైర్యం చెప్పిన నేనెవరో
ప్రపంచాన్ని మించిన ప్రేమను
పంచడానికి నేనెప్పటికైనా ఉంటానని
అనంత కోటి బ్రహ్మాండాలు
ఆశ్చర్యపోయేలా అరిచి చెప్పిన నేనెవరో
- లడె.నిత్య
ఐఐఐటీ బాసర