Authorization
Sun April 06, 2025 07:18:09 am
ఉమ్మనీటి కొలనులో
ఊకొడుతూ విన్న భాష,
ఉగ్గుపాలతో రంగరించబడి
అమ్మ పొత్తిళ్లలో
అప్రయత్నపు పలుకై
అంకురించే బీజం
''అమ్మ భాష.''
మదిలోని భావాలను
సరళమైన పదాలతో
సులువుగా చెప్పగలిగే
''ఉగ్గుపాల భాష'',
భాషలన్నీజి
తనలోనే నింపుకోగల
''హదయ భాష''
చుక్కలెనున్నాజి
జాబిలిని మించలేవు,
సష్టిలో భాషలెన్నున్నా
మనసు తెలిసి
మమత పంచే
''అమ్మభాష''కు సాటి రావు.
తలపులకు జీవం పోస్తూ,
మూర్తిమత్వ వికాసానికి
సోపానమైజి
మానసిక వికాసానికి
మాతకగా నిలిచే
''మాతభాష'' రుచినెరిగి
పరభాషలు నేర్చుకొందాం,
మనుగడ సాగిద్దాం
మాతభాషలోనే...
- వేమూరి శ్రీనివాస్
9912128967