Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్భయ దిశ లాంటి
చట్టాలెన్ని రూపొందించినా
కలి కీచక అకత్యాలు ఆగలేదు
జీవిత ఖైదు ఉరి లాంటి
కఠిన శిక్షలేన్ని విధించినా
కామ పిశాచి పీడ విరగడ కాలేదు
థర్డ్ డిగ్రీ ,ఎంకౌంటర్ లాంటి
తీవ్ర ప్రయోగాలెన్ని చేసినా
మదోన్మాదుల తీరు మారలేదు
పశు వాంఛ తీర్చుకోన
పసి మొగ్గ మొదలుకొని
చావుకు చేరువైన వద్ధను
వదలక చెరబట్టే కీచకత్వం
ఆడ మాంస ముద్దయితే
చాలనే పైశాచికత్వం వెరసి
పూటకో అఘాయిత్యం
గడియకో అత్యాచారం
నిత్య తంతుగా మారింది
ఈ వ్యవస్థలో...
అతివ బతుకు తీరు
గడియ గడియ గండం
గడప దాటితే అగ్నిగుండం
ఈ కుసంస్కతి స్థిరమైతే
అమ్మతనం అంధకారం
మానవత్వం మటు మాయం
మనిషి అస్తిత్వం శిథిలశకలం
ఇప్పటికైనా...
సమాజం బాధ్యతగా స్పందిస్తే
విష బీజాన్ని ఆదిలోనే తుంచేస్తేనే
స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ సంప్రాప్తిస్తుంది
(సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటనకు స్పందనగా)
- కోడిగూటి తిరుపతి,
9573929493