Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటతో పాటే తన జీవితమంటున్నాడు ఈ యువసంగీత దర్శకుడు. సంగీతమంటే చిన్నప్పటి నుంచి వల్లమాలిన అభిమానం అతనికి.. సంగీత సాధనతోనే పెరిగాడు..ఇప్పుడు సంగీత దర్శకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు.. ఇండిపెండెంట్ సాంగ్స్ తో అందరి మనసులను ఆకర్షించాడు.. గాయకుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల అచీవర్స్ సినిమాతో సినీ సంగీత దర్శకుడిగా కూడా పరిచయ మయ్యాడు.. ఏకకాలంలో సంగీతదర్శకుడిగా, గాయకుడిగా రాణిస్తున్న వెంకటేష్ వుప్పలతో ఈ వారం జోష్...
మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి?
నా పేరు వెంకటేష్ వుప్పల. హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. 12వ వరకు హైదరాబాద్‌లో చదివి, గ్రాడ్యుయేషన్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ పంజాబ్‌లో చేశాను. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. నాన్న వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. అన్న,చెల్లెలు కోపరేట్ ఉద్యోగం. నెలవారీ ఖర్చులు వరకు సంపాదించుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాం.
సంగీతం వైపు దృష్టి ఎలా మరలింది?
మా నాన్నకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మా నాన్న పేరు వుప్పల శ్రీనివాస్. నాన్న లాగే నాకు కూడా చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఇష్టం మరియు ఆసక్తి. కేవలం ఇంట్లో ఒక హాబీ గా తండ్రి అపుడపుడు కీబోర్డ్ ప్లే చేసే వాడు. గ్రాడ్యుయేషన్ కాలేజికి వెళ్ళే వరకు మాకు కూడా కీబోర్డ్ క్లాస్‌లు నేర్పించాడు. కాని ఆ ఇంట్రెస్ట్ తాకలేదు. గ్రాడ్యుయేషన్ కాలేజీలో గిటార్‌కి అట్రాక్షన్ అయినాను.. సాధారణ స్నేహితుడు డేగరా నుండి గిటార్ తీసుకోని, మార్నింగ్, నైట్స్ గిటార్ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఒక వన్ మంత్ లో గిటార్ బేసిక్ నేర్చుకొని, పాటలు ప్లే చేసేవాడిని... అట్లా నా ఇంట్రెస్ట్ మ్యూజిక్ బ్యాండ్ వరకు వెళ్ళింది. అక్కడ నుండి వెనక్కి చూడలేదు ఎపుడు..
మీ పాటల ప్రస్థానం గురించి చెప్పండి?
కాలేజీలో వేసవి, శీతాకాల సెలవులుకి హైదరాబాద్ ఇంటికి వెళ్ళాలి అంటే ఖర్చు ఎందుకు అని, కాలేజీలో ఒంటరిగా ఉండే వాడిని. ఆ ఫ్రీ టైమ్‌లో మ్యూజిక్ కంపోజింగ్, మ్యూజిక్ సాఫ్ట్వేర్ పై ఆసక్తి ఉండేది. నాకు అంతంట నేనే ఫ్రూటీ లూప్స్ అంటే ప్రొఫెషనల్ మ్యూజిక్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను.. అట్లా మామూలు కవర్ సాంగ్స్ తో స్టార్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్స్ కి సాంగ్స్ చెయ్యడం స్టార్ట్ అయింది. ఆ షార్ట్ ఫిల్మ్ నుండి ప్రైవేట్ సాంగ్స్ వరకు, అక్కడ నుండి ఆదిత్య మ్యూజిక్ వరకు వచ్చాను.
ఆదిత్యతో రెండు పాటలు చేసాను సుమంత్ బొర్రతో కలిసి ఒక్కటి ఎలా మరి ఇక రావా - 14 మ్యూజిక్ లో ట్రెండ్ అయింది.. తర్వాత పడిపోయా ఒక మెలోడిక్ అడిక్షన్ సాంగ్ ఇప్పటి వరకు ఆదిత్యలో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ ఒక ట్రెండీ వెడ్డింగ్ సాంగ్ కూడా వస్తుంది. వేడుక కన్నారో మహ ఎంత అనే పేరు తో.. ఇంకా బ్లాక్ బస్టర్ సాంగ్ త్వరలో. ఒకటే జానర్ కాకున్నా అన్ని రకాల పాటలు నా సిగేచర్తో పాశ్చాత్య స్టైల్‌ని ఇండియన్ స్టైల్ అనే ఒక గోల్ తో చేస్తాను.
ఇంకా ఫుల్ టైమ్ మ్యూజిక్ చేసేవాడిని కాబట్టి, కంప్లీట మ్యూజిక్ మీద డిపెండ్ అవ్వల్సి వచ్చింది..వేరే జాబ్ కి ఇంట్రెస్ట్ ఎపుడు రాలేదు. కాబట్టి సాధారణ ఖర్చులు కోసం పెళ్లి పాటలు ఒక మంచి పెళ్లి ఇంట్లో %ష్ట్రఙష్ట్ర ఆష్ట్రం% తో పని చేసాను. ఇప్పటి వరకు దాదాపు ఒక 6-7 పాటలు ఇచ్చాను వాళ్ళకి.. ఇప్పుడు కూడా వాళ్ళతో ఫ్రీలాన్సర్‌గా కూడా చేస్తున్నాను.;
మన చిత్ర పరిశ్రమలో దీపు గాయకుడు, మెహర్ రమేష్, రాజ్ కందుకూరి, గీతా భాస్కర్, కార్తీక్ కొడకండ్ల లాంటి పెద్ద పెద్ద క్రియేటివ్ డైరెక్టర్లను కలిశాను. వారి ఆటోగ్రాఫ్స్ తీసుకున్నాను.
గాయకుల్లో మీకు రోల్ మోడల్ ఎవరు?
చిన్నప్పటి నుంచి ఏ ఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, ఇళయ రాజా వంటి లెజెండరీ మ్యూజిక్ లెజెండ్స్ మ్యూజిక్‌ని బాగా ఎంజారు చేసే వాడిని. కన్ని గ్రాడ్యుయేషన్ లో అవిసి అనే వెస్ట్రన్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌కి చాలా ఇన్స్పైర్ అయ్యా. అవిసి ఇపుడు లేడు.కానీ అతని సంగీతం ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
ఏకకాలంలో సంగీతదర్శకుడిగా, గాయకుడిగా ఎలా సాధ్యమవుతుంది?
ప్రతి సాధారణ జీవితంలో మరియు నా సంగీత అంశంలో కూడా స్వతంత్రంగా ఉండాలనే మనస్తత్వం నాకు ఉంది. కాబట్టి సమయపాలన పాటించని లేదా నిబద్ధత లేని కొంతమందితో పనిచేసిన అనుభవాలు నాకు ఉన్నాయి. అదే నాకు నేను అన్నీ నా సొంతగా చేయడానికి స్ఫూర్తినిచ్చింది. మ్యూజిక్ కంపోజర్‌గా, ప్రొడ్యూసర్‌గా నేను మొదటి నుండి మ్యూజిక్ చేస్తాను కాబట్టి అన్నీ నేనే చేస్తే ఆ విజన్ కూడా చాలా స్పష్టంగా ఉంది. మనం చేయగలిగితే ఎందుకు కాదు! ప్యాషన్ అనేది ఉంటే టైం అలాట్ మెంట్ ఎప్పుడు కష్టం కాదు. మీకు కఠినమైన అభిరుచి ఉంటే, మీరు ఎల్లప్పుడూ సూటిగా ఆలోచిస్తారని ఒక సామెత ఉంది.
మీకు జీవితంలో ఎంతో ఆనందాన్నిచ్చిన సంఘటన?
ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌లో నేను, నా టీమ్ ప్లాటినం అవార్డు గెలుచుకోవడం మొదటి అవార్డు అది..అది కుడా ఆసియా.. ఒంటరిగా అతి పెద్ద పోటీ..మరియు 12 సంవత్సరాల నుండి తెలుగు వాళ్ళలో మొదటిసారి గెలవడం, అది కుడా హిప్ హాప్ లో, ఇన్ని అంశాలలో ప్రత్యేకమైన, సంతోషకరమైన మరియు మరపురాని ఈవెంట్‌ను గెలుచుకోవడం. నేను pin16, బైనరీ బగ్ నన్ను పోటీలకు నెట్టినందుకు నా జట్టు సభ్యులకు ధన్యవాదాలు. నాకు అంతటా నేను ఈ పోటీలకు వెళ్ళే వాడిని కాదు. వెళ్ళమని నన్ను పుష్ చేసారు. ఇప్పటి వరకు నేను వేరే వాళ్ళని పుష్ చేసి వాళ్లలో బెస్ట్ తెప్పిచ్చేవాడిని. ముందుగా నన్ను పుష్ చేయడం,నేను వెళ్ళేలా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మీరు పొందిన ఉత్తమమైన ప్రశంస?
బెస్ట్ కాంప్లిమెంట్ అంటే... నాది ఒరిజినల్ క్యారెక్టర్. నేను చాలా ప్రత్యేకమైన, చాలా ఆకర్షణీయమైన, చాలా భిన్నమైన మంచి మార్గంలో వ్యసనపరుడనై సంగీతాన్ని చేస్తాను. అలాగే నేను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్‌గా ఉన్నాను,ఇంకా చాలానే కాంప్లిమెంట్స్ ను నేను తరచుగా అందుకున్నాను.
ఎలాంటి పాటలకి ట్యూన్ చేయడమంటే ఎక్కువ ఇష్టం? అంటే ఫోక్ అ? రొమాంటిక్ అ? మెసేజ్ ఓరియంటెడ్ అ?
సంగీతం అనేది ఒక అనుభూతిని వ్యక్తీకరించడానికి ఒక మార్గం, ఆనందం లేదా విచారం లేదా ప్రేరణ మొదలైనవి. ప్రజల హృదయాన్ని కలిపే ఏదైనా నేను ఇష్టపడతాను. కాబట్టి నేను మెసేజ్ ఓరియెంటెడ్, రొమాంటిక్, విషాదకరమైన అన్నీ చేస్తాను బీట్ చాలా మటుకు వెస్ట్రన్ క్యాచీ మ్యూజిక్ చేయడంఅంటే ఇష్టం.
మీరు పొందిన పురస్కారాల
నా సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయడం నా అతి పెద్ద విజయం. అందుకు ఆదిత్య మ్యూజిక్ లాంటి అతి పెద్ద మ్యూజిక్ లేబుల్‌తో వర్క్ చేయడం ఒక అచీవ్ మెంట్ ఐతే. భారతీయ చలనచిత్ర ప్రాజెక్ట్ సీజన్ 12 లో హిప్ హాప్ సంగీతంలో మొదటి ఫ్రైజ్ రావటం ఇంకో అచీవ్మెంట్. అందరి ఆశీర్వాదం మరియు ప్రేమ నా ఆల్ టైమ్ అచీవ్మెంట్స్.
పాటంటే ఒక్క మాటలో?
నా అభిరుచి, నా శ్వాస మాత్రమే నేను జీవించడానికి కారణం.., నేను ఈ రోజు ప్రజల ప్రేమకు దూరంగా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రాణం.
- జోష్ టీం