Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలువపువ్వు విరిసినట్లు
గోదారి అలల మీద
వెండివెన్నెల రాలినట్లు
పరిమళించే మానవత్వానికి
మెరుపుచీర చుట్టినట్లు
గుండెగగనంలో
నక్షత్రం నవ్వినట్లు
నిను చూడగానేహొ
కనులలో పున్నమి పూసినట్లు
నీ రూపమెంత అపురూపమో
- సురేంద్ర రొడ్డ, 9491523570