Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని వ్యవస్థలు
వ్యక్తిగతాలను భుజాన వేసుకుని
గాలిలో దీపాలు ముట్టించి
వెలుగుల్ని చీకట్లోనే మగ్గిస్తూ
అన్యాయం చేస్తున్నాయి
ఆత్మద్రోహం చేసుకుంటూ
ఆకలి చేసే తప్పుకు
తెలివితక్కువోళ్లు
క్షుద్భాధ తీర్చుకునుటకై నాల్గు రాళ్లు
తస్కరిస్తే వాళ్ళ తోళ్ళు వల్చేస్తారు
అమానవీయంగా గుడ్లురుముతూ
అదే
ఉన్నోళ్లు నేలతల్లినే తార్చుతూ
నడి మైదానంలో వెలకడుతుంటే
వాళ్ళ అరికాళ్ళు కందకుండా
అరచేతులుంచుతున్నారు
హంగూ హోదా ఒక్కటేనంటూ
రక్షణ గోడగా
కులాల పోరులో
ఆదిపత్యకులాలు సామాన్యుడి నెత్తిపై
కరాళ నృత్యం చేస్తున్నాయి
చివరకు మట్టినే నమ్ముకున్న
మట్టిజనుల నోట్లో ఆ మట్టినే కొట్టి
అదే మట్టిలో కలిపేస్తున్నాయి
వీటినడుమ
పత్రికల పక్షపాతపు
కక్షల హోరులో నిజాక్షరాలు
దుమ్ము కొట్టుకుపోతున్నాయి
- నాగముని. యం, 9490856185