Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనామకంగా మొదలై
ఆకాశమంతా ఎదిగి
తెలంగాణ అంటే టీ హబ్ గా
నామకరణం సార్థకమైనది
గడ్డి నుండి గగనం వరకు
గగనమే లక్ష్యంగా.. దూకుడుగా..
ఆవిష్కరణ తోరణాలు కడుతున్నవి
స్టార్టప్ సాఫీగా
ఇన్నోవేషన్ ఇంక్యుబేషనుతో
టీ హబ్ రాకెట్ లా దూసుకుపోతున్నది
నిన్న మొన్న బెంగళూరే నెలవుగా వున్న..!
నేడు హైదరాబాదే బ్రాండ్
హబ్ గా కొలవై వెలుగై నిలుస్తున్నది
స్విగ్గీ, ఉడాన్, క్రెడ్
మీషో, ఓయో... వగైరా కంపెనీలు
హైదరాబాద్ నగరానికి
మిలియన్ డాలర్ల మార్కెట్లుగా
వన్నె తెచ్చుచున్నవి
ఉద్యోగ ఉపాధికి పునాదులుగా
ఎందరికో బంగరు భవిష్యత్తుకు భరోసై
యువత ఆలోచనలకు వాస్తవరూపమై
దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతూ..
దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌గా
అంకురాలకు అమ్మగా
ఆవిష్కరణలకు పట్టుకొమ్మగా
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హబ్
సంచనాల పతకమును ఎగురవేస్తున్నది
సకల ఆలోచనల సమాగమంతో
కేసీఆర్ దార్శనికతకు
కెటిఆర్ నిబద్ధతకి, సంకల్పానికి
ప్రతిరూప దైవనిలయముగా
దేశ విదేశీయుల పెట్టుబడులు
ప్రోత్సాహక ఊతమై
అంతర్జాతీయ స్థాయిలో
తెలంగాణకే సగర్వంగా
హైటెకులో జాబ్ లకు హబ్ గా
భారత దేశానికే టీ - హబ్
తలమానికంగా విరజిల్లుతున్నది
- డాక్టర్ పగిడిపల్లి సురేందరు
80748 46063