Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరం ఒకచోట
కలిసుంటె సంక్రాంతి.
అపుడపుడు కలిసుంటె
అదో కాంతి..
అపుడో...ఎపుడో కలుసుకుంటె...
ఓ చిరుకాంతి.
అందరంకలిసి
నవ్వుకుంటుంటె అగుపిస్తుంది
వెన్నెలకాంతి.
మనందరం కలిసి నడుస్తుంటె...
అదో మహాకాంతి.
మనమే ఓ దారివేస్తుంటె..
అదో అద్భుత కాంతి.
మనదారెంటె అందరూ నడుస్తుంటె... మహాద్భుతకాంతి.
ఒక్కడుగ వుంటేనే..
ఇంతకాంతి విరిస్తె...
మనమెప్పటికిలాగె కలిసుంటుంటె..,
అదేకదా క్రాంతి.
ఏడాదికోమారు కాదు సంక్రాంతి..!
మనం కలిసిన ప్రతిసారి సంక్రాంతి.
నిజం.
- అనుముల ప్రభాకరాచారి