Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాట అడ్డా ఓరుగల్లు గడ్డ
అరుణ వర్ణం పులుముకుంది
ఎర్ర పార్టీ సారథ్యంలో సాగే
జన చైతన్య యాత్ర సభకు
సబ్బండ వర్గము తరలింది
అజంజాహి మిల్లు ప్రాంగణం
జన సంద్రాన్ని తలపించింది
హనుమకొండ నగరం నిండా
ఎర్రెరని జెండాలు ఎగిరినరు
అరుణ తోరణాలు వెలిసినరు
ఉద్యమ గీతాలు హౌరెత్తినరు
అప్రజాస్వామిక విధానాలు
మతోన్మాదశక్తుల ధిక్కరిస్తూ
నినాదాలు నింగినంటినరు
పిల్లా పెద్దలు అనే తేడా లేక
యాత్రకు నేను సైతమంటూ
డప్పు కొట్టి దరువు వేసినరు
కార్మిక కర్షక శ్రామిక శక్తులు
కదంతొక్కి కవాతు చేసినరు
కార్యసాధకులు దండుగట్టి
మహా ప్రదర్శనగా సాగినరు
మొత్తంగా చైతన్య యాత్ర
విజయవంతమై విరిసింది
ఎగిరే ఆ ఎర్ర జండాకు
పోరు దండాలు!
ఆ చైతన్య గళాలకు
శౌర్య 'శృతి' అందిద్దాం
ఆ ప్రగతిశీల యోధులకు
మన 'మద్దతు' ప్రకటిద్దాం
ఆ జన చైతన్య యాత్రకు
స్వచ్ఛందంగా సాగుదాం.
- కోడిగూటి తిరుపతి,
సెల్:9473929493