Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ బుద్ధుడా!
మానవాళి మిత్రుడా!
క్రూరకుటిల కులతత్త్వపు కోరల
పెకలించి - సకలజనులకు
సుఖశాంతుల నొసగినవాడా!
మనిషన్నవాడు చదువుకోవాలని
తానెవరన్నది తెలుసుకోవాలని
విషయం సత్ ప్రవర్తనల దిద్ది తీర్చుకోవాలని
అజ్ఞానం వదిలించుకోవాలని
ఆత్మబలం, విశ్వాసం పెంచుకొని
అద్భుత విజయాలు అందుకోవాలని
బోధించినవాడా!
చరిత్ర పొడుగున కొనసాగిన
కౌటిల్యుని అర్థశాస్త్రాలకు భిన్నంగా
కొనసాగిన బుద్ధిస్ట్ అర్థశా్తజ్ఞుడా!
పెద్దపీటవేసిన అర్థశాస్త్రజ్ఞుడా
సాంఘిక విప్లవరణ దుంధుభి మ్రోగించినవాడా!
సుపరిపాలనకు
చిన్న రాష్ట్రాలు మేలన్నావుకదా!
నవభారత రాజ్యాంగం అందించినవాడా!
కర్షక కార్మిక జనులను
మహిళలను ఉద్ధరించినవాడా!
సమతావైతాళికుడా! అభినవ బుద్ధుడా!
నీ సమున్నత వ్యక్తిత్వానికి
ఈ నీ ఉన్నత విగ్రహరూపం
చంద్రునికో నూలుపోగు
జ్ఞానభాండాగార సాగరాన్ని
మధించిన నీ విశాల హృదయానికి
ఇది గ్రంథాలయాలు చేస్తున్నవి అక్షరార్చనం
సజీవ ఆదర్శానికి నిదర్శనం
సమున్నత మేధాసంపదను
మేల్కోల్పే చైతన్య దీపం
స్వయం కృషిని ప్రబోధించే మౌన సందేశం.
- కడియం సోమన్న, 784299964