Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ ఆరోగ్య మిషన్ ఏకకాలంలో ఉమ్మడి కార్యాచరణతో పట్టుదలతో నిర్వహించదగినవి. పోషన్ అభియాన్, జాతీయ ఆహార భద్రత, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, నీటి పరిశుభ్రత, సర్వశిక్షా అభియాన్ మొదలైనవి. పూర్తిగా పన్నుల నిధులతో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు మెరుగైన నమూనాగా ఉన్నది. కానీ, ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య బీమా యోజన ఆవిధానాన్ని దెబ్బ తీస్తున్నది.
భారత రాజ్యాంగం జీవించే హక్కుకు హామీ ఇచ్చినట్లుగా, ఆరోగ్యాన్ని ప్రాథమికమైన మానవ హక్కుగా మనం నమ్ముతున్నామా? దీనికి భిన్నంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం విషయంలో ఇచ్చిన నిర్వచనాన్ని నమ్ముతున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం, ఆరోగ్యం అంటే సంపూర్ణ మైన, మానసిక, సామాజిక శ్రేయస్సు, శారీరక దారుఢ్యానికి మించిన ఆనందం, వ్యాధులు, అంగవైకల్యం లేకపోవడం. దీనర్థ మేమంటే, ఆరోగ్యానికి సంబంధించి మౌలిక మైన సమస్యలను(నిర్ణయాకాలను) పరిష్కరించకుండా, మనం ఆరోగ్యాన్ని, దాని విస్తృతమైన నిర్వచనంలో పరిష్కరించలేం. వైద్య, ఆరోగ్య శాఖలకు అతీతంగా, స్త్రీ శిశు అభివృద్ధి, ఆహార, పోషక, వ్యవసాయంతోపాటు, పశుసంవర్ధక, పౌర సరఫరాలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, సాంఘికసంక్షేమం, గిరిజనాభివృధ్ధి, విద్య, అటవీశాఖల పరస్పర సహకారంతో కూడిన, సమగ్రమైన, ప్రమాణాలు కలిగిన ఆరోగ్య విధానాన్ని రూపొందించవలసి ఉంది.
1977లో హాల్ఫ్ డాన్ మహ్లెర్ చే ప్రతిపాదించబడి, ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఆమోదించబడిన,2000 వరకు అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని మనందరం అంగీకరించాం. ''అందరికీ ఆరోగ్యం'' అనే నినాదంలో స్వాభావికమైన, లోతైన అంతరార్థం ఉన్నది. ఈ నినాదం సార్వజనీనమైనది కనుక, ఎవరూ వ్యతిరేకించరు. ఎందువల్లనంటే, ఆర్థిక స్థితిగతులను బట్టి ఎవరూ, ఎలాంటి వివక్షతకు గురికారు. లింగ, జాతి, పుట్టిన ప్రదేశం, చెల్లించగలిగిన సామర్థ్యం, స్తోమతను బట్టి గానీ, మరే ఇతర కారణాల రీత్యా ఎవరూ ఆరోగ్య సేవల నుండి తిరస్కరించబడరు. 1977 నాటికే, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం సూచించబడింది. భారత దేశం తన జాతీయ ఆరోగ్య విధానం 1983, ద్వారా అందరికీ ఆరోగ్యం అనే 2000 లక్ష్యానికి తనకు తాను కట్టుబడి ఉంది.
జనాభా యొక్క, పాలక ప్రభుత్వం యొక్క పాక్షికమైన కవరేజ్, ఆరోగ్య సంరక్షణ కోసం ఎప్పుడు, ఎక్కడ లభిస్తుంది.1978 ఆల్మా ఆటాలో, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పౌరులందరి కనీస సంరక్షణ కోసం 8భాగాలతో కూడిన జాబితా ఇచ్చింది. ఇది అన్ని ఆరోగ్య ప్రోత్సాహక కార్యక్రమాలను తప్పనిసరి చేసింది. ఆరోగ్య చర్యలను ప్రోత్సహించడానికి టీకాలు వేయడంతో సహా, వ్యాధి నిరోధక చర్యలను, స్వల్ప వ్యాధులు, యాక్సిడెంట్స్ లాంటి వాటికి, ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా పేదవారికి, ప్రభుత్వ వనరులను ఉపయోగించి ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించింది. అంటువ్యాధులు కాని వ్యాధులు, దీర్ఘకాలికవ్యాధులు, మానసిక రోగాలతో సహా, వాటి పరిశోధనలు, వైద్యం, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ నుండి మినహాయించబడింది. ప్రాథమిక సెకండరీ, తృతీయ ఆరోగ్య సంరక్షణలు అవసరమైనప్పుడు అది తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల నుండి గాని, తన స్వంత ఖర్చులతో, ప్రయివేటు రంగంలోని వైద్యశాలలకు చెల్లించి, వైద్యం చేయించుకునే విధానాన్ని ఆయా వ్యక్తులకే వదిలివేసింది.
ప్రభుత్వంచే నిర్వహించబడే వైద్యశాలలు పేదల అవసరానికి అనుగుణంగా తగినన్ని లేవు. (దోపిడీ ఆధారిత, ప్రయివేటు వైద్యానికి పేదలు చెల్లించే స్తోమత లేదు) ద్వితీయ, తృతీయ రక్షణ నుండి ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం వల్ల ఎలాంటి నియంత్రణలు పాటించకుండా, లాభాలను ఆర్జించే ఆధిపత్య ప్రయివేటు రంగాలకు భరోసా కల్పించింది. ఆరోగ్య బీమా రంగాలను సంతోష పర్చడమేకాక, ఆయా రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందేందుకు దోహద పడింది. ఇది ద్వితీయ, తృతీయ స్థాయిలలో, ప్రాథమిక, సంస్థాగత నిపుణుల మధ్య వైరుధ్యాలను సృష్టించింది.
పేదలకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయని, అసంక్రమిత వ్యాధులు, హృదయ సంబంధమైన, నరాలకు సంబంధించిన, మానసిక, జీవక్రియ ఇబ్బందులు, వీటితో పాటుగా పరిశోధనల అవసరాలను గుర్తించి, ఉపరితల ప్రాథమిక ఆరోగ్య సంస్థల నిర్వహణ తోపాటు, సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను నిర్వచించటం జరిగింది. 2013లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక సహేతుకమైన నిర్ణయంతో, ఇది కార్యరూపం దాల్చింది. గత శతాబ్దం రెండో భాగంలో ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల ద్వారా సమగ్రమైన ప్రాథమిక కేంద్రాలను నమోనాగా అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించబడింది.
ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని (స్వస్థత) పొందే హక్కుతో పాటు, వైద్యం అందక ఎవరూ ఎలాంటి ఆరోగ్య సమస్యలతోగానీ, వైకల్యంతోగానీ మరణించకూడదు. ఆ హక్కు ప్రజారోగ్య వ్యవస్థలో వ్యక్తివాదం ద్వారా మాత్రమే హామీ ఇవ్వబడుతుంది. యూహెచ్‌సీ నూతన ప్రపంచ విధానం ప్రకారం ఎవరూ కూడా లెక్కించబడకుండా ఉండడంగాని, అశ్రధ్ధగా వదిలివేయడంగాని జరగరాదు.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను గూర్చి ఆల్మా ఆటా ప్రకటనను, ఒక అందమైన భవనం యొక్క గత భావనలుగా వదిలివేయాలి. యూహెచ్‌సీ అనే నూతన భావనలతో మనం ముందుకు కొనసాగాలి. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని యూహెచ్‌సీ సమన్వయంతో, అవసరమైన వారికి ఎలాంటి వివక్ష లేకుండా ఆరోగ్యాన్ని అందుబాటులోకి తేవాలి.
సార్వత్రిక ఆరోగ్య సంక్షేమ నినాదం మోసపూరితమైనది కాబట్టి, దాని నుండి దూరంగా ఉండాలి. ఎందువల్లనంటే, ఇది దాని అమలులో, సారవత్రికమైనదికాదు, తన సేవల అమలులో సమగ్రమైనది కూడాకాదు. దాని ఆర్థిక వ్యవహారాలనేవి, వ్యక్తి లేక రాష్ట్రం ద్వారా చెల్లించే బీమా ప్రీమియంల షరతులకు లోబడి ఉంటుంది. కాబట్టి స్తోమతనుబట్టి అందరికీ అందుబాటులో ఉండటాన్ని గురించి ఎలాంటి హామీ ఇవ్వదు. 2004-2010 కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, లాక్ ఫెల్లార్ ఫౌండేషన్‌కు లొంగి ఉండాల్సింది కాదు. మార్కెట్ అనుకూల సంస్కరణల మార్గదర్శకాలతో, రాష్ట్ర నియంత్రణలను తగ్గించడం, ఆర్థిక రహిత సేవా కవరేజ్ ఎంపిక వంటి సర్దుబాట్లు జరిగాయి. ఇది అందరికీ ఆరోగ్యం అనే భావన నుంచి వెనక్కు తీసుకు వెళ్తుంది. యూహెచ్‌సీ భావనను పలుచన చేస్తుంది. దీనిలో ఓదార్పు ఏమంటే 2011లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ చేసిన తీర్మానం. ఆరోగ్య రంగానికి ఆయా దేశాలు సమయానుకూలంగా, ఆర్థిక సహకారం అందించాలని, వైద్యం కోసం జేబు ఖర్చులు తగ్గించాలని, కుటుంబ పేదరికానికి దారితీసే ఆరోగ్య విపత్తుల ఖర్చులు తగ్గించాలని కోరింది.
2018 సంవత్సరపు ఆస్తానా ప్రకటన, ప్రయివేటు రంగంతో భాగస్వామ్యం కోసం పిలుపు నిచ్చింది. అయితే, ఆల్కహాల్, పొగాకు, రసాయనికంగా ప్రాసెస్ చేయబడిన పదార్థాలు, వాణిజ్య ప్రయివేటు రంగం వల్ల ఏర్పడిన పారిశ్రామిక, ఆటోమొబైల్ కాలుష్యం స్థిరపడింది. అదేవిధంగా పేద దేశాలు ఘోరంగా విఫలమవుతాయి లేక ఆ దేశాలు ప్రయివేటు రంగ నియంత్రణకు ఇష్టపడవు. ఇది పేదరికం, నిరుద్యోగం, పేదల జీవనోపాధిని గురించి ఎన్నడూ ప్రస్థావించదు. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, యూహెచ్‌సీకి మూలస్తంభంగా ప్రశంసించింది. కాని, విస్తృతమైన యూహెచ్సీని నిర్లక్ష్యం చేసింది.
2012లో నిర్వహించబడిన బీజింగ్ ఆరోగ్య విధానాల పరిశోధనా సమావేశం, ప్రపంచ వ్యాప్తంగా, ఆరోగ్య వ్యవస్థల భావనను ఆమోదించింది. దీని ఉద్దశ్యమేమంటే... వివిధ రంగాల, విస్తృత నోడల్ వ్యవస్థ, వృత్తి సంబంధమైన, నైపుణ్యంతో కూడిన వైద్య విధానాలతో, సమగ్రమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి, వివిధరకాల నైపుణ్యం గల సిబ్బందితో కూడిన ఏర్పాట్లు అవసరమని భావించింది.
జాతీయ ఆరోగ్య మిషన్ ఏకకాలంలో ఉమ్మడి కార్యాచరణతో పట్టుదలతో నిర్వహించదగినవి. పోషన్ అభియాన్, జాతీయ ఆహార భద్రత, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, నీటి పరిశుభ్రత, సర్వశిక్షా అభియాన్ మొదలైనవి. పూర్తిగా పన్నుల నిధులతో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు మెరుగైన నమూనాగా ఉన్నది. కానీ, ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య బీమా యోజన ఆవిధానాన్ని దెబ్బ తీస్తున్నది.
- డాక్టర్ కె.ఆర్. ఆంటొని
అనువాదం: వీరభద్రరావు మల్లెంపాటి,
9490300333