Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి రక్తస్రావ రుగ్మతనే హీమోఫిలియో. కోవిడ్19 హీమోఫిలియోతో బాధపడే వారికి అనేక సమస్యలు సృష్టించింది. సమాజంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17ను అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇది 1969లో ప్రపంచ హిమోఫిలీయో ఫెడరేషన్‌ను ప్రారంభించిన ప్రాంక్ స్నాబెల్ పుట్టిన రోజు ఏప్రిల్ 17, 1989నుండి దీన్ని జరుపుతున్నారు. హిమోఫిలియో రుగ్మత ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ఈ రుగ్మత అంటూ వ్యాధి కాదు. హిమోఫిలియోతో బాధపడే వారికి చిన్న గాయం అయిన రక్తం గడ్డకట్టక పోవడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగి మరణించే ప్రమాదం ఉంటుంది. దీని రుగ్మత రెండు రకాలుగా ఉంటుంది. వీటిలో హిమోఫిలియో -ఏ, హిమోఫిలియో- బి. ఏ రుగ్మత ప్రతి పదివేల మందిలో ఒక్కరికి, బి ప్రతి ఇరవైవేల మందిలో ఒక్కరికి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.వీటిలో బి రుగ్మత నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది ఈ రుగ్మత కలిగిన వారికి మగపిల్లలు పుడితే ఎక్కువ మంది పుట్టిన బిడ్డకు పరీక్షలు చేయాలని కోరుకుంటున్నారు.
హిమోఫిలియో రుగ్మతతో బాధపడుతున్న వారిలో 80నుంచి 90శాతం మందికి ఈ వ్యాధి ఉందనే విషయం కూడా తెలియడం లేదు. మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, గర్భంతో ఉన్న వారు ఈ వ్యాధి భారిన పడే అవ కాశం ఉంది. స్త్రీల కంటే పురుషులలో హీమోఫిలియో రుగ్మత ఎక్కువ. ప్రతి ఐదువేల మంది మగ పిల్లల జనంలో ఒక్కరికి హిమోపిలియో ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్ర మించే హిమోఫిలీయో వలన గాయమైతే రక్తం గడ్డ కట్టకపోవడం వలన చిన్న గాయాలైన అధిక రక్త స్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా జన్నులోపాలతో హీమోఫిలియో రుగ్మత సంక్రమిస్తే నివారించడం సాధ్యం కాదు. ప్రస్తుతం నామమాత్రంగా వైద్యం అందుబాటులో ఉంది. మరికొన్ని సందర్భాల్లో మెదడు, కీళ్లలో అంతర్గత రక్త స్రావం జరిగి మరణించే ఆస్కారం ఎక్కువ. కీళ్లు, కండరాలలో రక్త స్రావం జరిగి నొప్పులు ఏర్పడే అవకాశం ఉంది. హిమోఫిలియో ఉన్న వారికి ఎక్కువగా కీళ్ల వ్యాధులు, రక్త స్రావం జరిగి ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. 15-20శాతం మంది హిమోఫిలియో రుగ్మతతో బాధపడుతున్న యాంటిబాడీస్ అభివృద్ధి చేస్తున్నారు. అయితే దీని చికిత్స చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకున్నది.
2009లో ఉత్తప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని సంజరు గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరికొన్ని కేంద్రాల్లో యాంటీ హిమోఫిలిక్ కారకాలు అందుబాటులోకి వచ్చిన పర్యవసానంగా హిమోఫిలియో సంరక్షణ మెరుగైనది. ప్రస్తుతం భారత దేశంలో దీని రుగ్మత చికిత్స ప్రారంభదశలోనే ఉంది హిమోఫిలియోతో బాధ పడుతున్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు. కొన్ని కేంద్రాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ అవి సరిపోవు. చికిత్స కేంద్రాల నిర్వహణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేయవలసిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో 10-80 శాతం పీడబ్ల్యూహెచ్ ఉందని అంచనా. కానీ మన దేశంలో కేసులు చాలా తక్కువ నమోదు చేస్తు న్నారు. భారత హిమోఫిలియో సమాఖ్య రిపోర్ట్ ప్రకారం మన దేశంలో సుమారు 1.36లక్షల మంది ఉంటారని అంచనా. కానీ 19,690మందే అధికారికంగా నమోదు చేయడం వ్యాధి తీవ్రతను తగ్గించడమే. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పాలకులు చెబుతున్నప్పటికీ హిమోఫిలియో రుగ్మత ఉన్నవారికి ఆరోగ్య సంరక్షణ అందించే విఫలమవుతూనే ఉన్నారు. ఈ రోగ నిర్దారణ, చికిత్సలో మన దేశంలో అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు. నిర్ధారణ కోసం చేసే పరీక్ష కోగ్యులేషన్ స్క్రినింగ్ జిల్లా ఆస్పత్రులు మెడికల్ కాలేజీల్లోనూ కనపడవు.
ప్రభుత్వ అధ్యయనం ప్రకారం హిమోఫిలియో రుగ్మతతో బాధపడుతున్న వారి వయస్సు 13-25 సంవత్సరాల లోపు ఉంది. వీరిలో 68-79శాతం మంది వ్యాధి బారిన పడుతున్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే హీమోఫిలియో చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. ఈ రుగ్మత కలిగిన వారిని గుర్తించేందుకు రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హిమోఫిలియో ట్రీట్మెంట్ సెం టర్స్ ఏర్పాటు చేయాలి. రుగ్మతతో బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ, వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కషి చేయాలి. ఆర్థోపెడిక్‌తో పాటు హిమోఫిలియో చికిత్స కోసం అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ఈ రుగ్మత కలిగిన వారిలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు ముందస్తు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ దీనికి ఉచితంగానే చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నది. లేదంటే నిశ్శబ్దంగా సంక్రమించే ఈ వ్యాధితో ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
- ఎం. అడివయ్య
సెల్:9490098713