Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నేపథ్యంలో విశాఖ సంస్థను కొనటానికి కాదు, కొంత వర్కింగ్ కేపిటల్, బొగ్గు, ఇనుప ఖనిజం ఇచ్చి ప్రతిగా దాని ఉక్కు ఉత్పత్తులను తీసుకోవటం ద్వారా సదరు సంస్థను ఆదుకోవాలన్న సత్సం కల్పంతో ముందుకొచ్చిన బీఆర్ఎస్ను కసురుకోవటమెందుకు? మునిగిపోతున్న ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఎవరు చేయందించినా పట్టు కోవటానికి సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అలా సహకరించటం ద్వారా అదానీ, పోస్కోలాంటి వాళ్ళు చొరబడకుండా చేసే సదుద్దేశంతోనే ముందుకొచ్చింది బీఆర్ఎస్. పోనీ ఆ పనేదో వైసీపీ చేసినా సంతోషిస్తారు బాధితులు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 32మంది ఆత్మబలిదానాలతో 18వేల కుటుంబాలు త్యాగం చేసిన 20వేల ఎకరాల భూములలో విశాఖ పట్టణాన నెలకొన్నది ఉక్కు పరిశ్రమ. అందుకే దాన్ని కేవలం పరిశ్రమగా కాదు, 'మన అమరవీరుల స్మృతి చిహ్నం!- ''అన్నదాతల త్యాగఫలం!''గా భావి స్తున్నాం. అందువల్లనే 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అన్న నినాదం నేటికీ తెలుగువారి గుండెల్లో కొలువుండి పోయింది.ఈ పరిశ్రమకు నాడు కేంద్రం అందించిన మూలధనం రూ.5వేల కోట్లు. ప్రతి ఫ్రలంగా ఈ సంస్థ కేంద్రానికి చెల్లించిన పన్ను రూ.20వేల కోట్లు. అయినా సరే ప్రయివేటు ఉక్కు పరిశ్రమలకు ఉదారంగా ఇనుప గనులను కేటాయించిన కేంద్రం, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కుటుంబాలకు ఆసరా కల్పిస్తున్న ఈ ప్రభుత్వ సంస్థకు నేటికీ గనులు కేటాయించలేదు. సొంత గనులున్న పరిశ్ర మలకు టన్ను ఖనిజం వెయ్యి రూపాయలకు లభిస్తుంటే, గనులు లేక మార్కెట్లో టన్ను రూ.6వేలకు కొంటున్నందున ఉత్పత్తి ఖర్చు తడిసి మోపెడవుతున్నది అందుకే. అప్పుల పాలైంది సంస్థ. పోనీ ఈ సంస్థ కోసమని రైతులిచ్చిన పొలాలను రాష్ట్రపతి పేరిట కాకుండా సంస్థకు బదిలీచేస్తే వాటిలో బ్యాంకు రుణాలు తెచ్చుకుని సంస్థను అభివృద్ధి చేసుకోగలిగే వాళ్ళమంటున్నారు.ఇప్పటికైనా మించిపోలేదు. కేంద్రం మాకు రూ.5వేల కోట్లు వర్కింగ్ కేపిటల్ అందించినా, భూములను సంస్థ పేరిట బదిలీ చేసినా,గనులను కేటాయించినా ఈ సంస్థ లాభాల బాటలో పరుగెత్తిస్తామంటున్నది యాజమాన్యం.
అలా చేయటం మోడీ ప్రభుత్వానికి కష్టమేముంది? ఉదాహరణకు 18వందల కి.మీ. దూరంలోని గుజరాత్ ముంద్రా వద్ద గల ఆదానీ 7 పోస్కోల జాయింట్ వెంచర్‌కు తెలంగాణ లోని 'బైలదిల్లా' గనులను కేటాయించిన మోడీ, 450 కి.మీ.లోని విశాఖ ఉక్కుకు ఆ గనులెందుకు కేటాయించలేక పోతున్నారు? నేడు ఆదానీకి నచ్చిన ఏ ప్రభుత్వ సంస్థనైనా, అది చట్టవిరుద్ధమైనా సరే అతనికి కట్టబెడుతున్నారు ప్రధాని. ఇది జగమెరిగిన సత్యమే. వేలాది ఎకరాల భూములతో, సాగరతీరాన, ఓడరేవు నగరాన వెలసిన భారతైక ఉక్కు పరిశ్రమ. అందుకే దీనిపై ఆదానీకన్ను పడింది. అందుకే దీన్ని నష్టాల్లోకి నెట్టయినా అదానీ కోర్కె తీర్చేందుకే ప్రధాని ఇలా చేస్తున్నారని బహిరంగంగానే కార్మికులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.2లక్షల కోట్ల భూములు ప్లస్ 750 మిలియన్ టన్నుల ఉక్కును, 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగిన రూ. లక్షకోట్ల మిషనరీ. మొత్తం రూ.3 లక్షల కోట్ల విలువైన ఈ సంస్థను కేవలం రూ.3 వేల కోట్లకు తెగనమ్మేందుకు బరితెగించింది బీజేపీ. ఇంకో దయనీయమైన అంశం ఏంటంటే నాడు పరిశ్రమకు భూములిచ్చిన వారందరినీ ఉద్యోగాలిస్తామని ఒప్పించిన 18వేల కుటుంబా లలో 8వేల కుటుంబాలకే ఉద్యోగాలివ్వగలిగింది సంస్థ. మరి ఈ స్థితిలో ఆ భూములతో సహా సంస్థను అమ్మేస్తే, ఇటు ఉద్యోగాలు రాక, అటు భూముల్నీ కోల్పోయిన ఆ పదివేల కుటుంబాలవారు తమ 'గోడు' నెవరికి చెప్పుకోవాలంటూ బావురమంటున్నారు. ఈ అంశంపై వైసీపీ, టీడీపీ, జనసేన మెతకవైఖరిని అవలంబిచడం పట్ల కూడా ప్రజలు విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. పరిశ్రమను కాపాడేం దుకు వామపక్షాలు మాత్రమే శక్తిమేరకు ఉద్యమిస్తున్నా యనేది వాస్తవం. ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటమే తమ పాలసీ అంటున్న బీజేపీ ఏపీలో వైసీపీచేత అమ్మిస్తున్నది. ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్ముతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సన్న చిన్న రైతుల పిల్లలకూ రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేస్తున్నందుకు బీజేపీ అంటేనే ప్రజతు భగ్గుమంటున్నారు. బీజేపీకి తలూపుతున్న పార్టీల పట్ల కూడా గుర్రుగా ఉన్నారన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో విశాఖ సంస్థను కొనటానికి కాదు, కొంత వర్కింగ్ కేపిటల్, బొగ్గు, ఇనుప ఖనిజం ఇచ్చి ప్రతిగా దాని ఉక్కు ఉత్పత్తులను తీసుకోవటం ద్వారా సదరు సంస్థను ఆదుకోవాలన్న సత్సం కల్పంతో ముందుకొచ్చిన బీఆర్ఎస్ను కసురుకోవట మెందుకు? మునిగిపోతున్న ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఎవరు చేయందించినా పట్టు కోవటానికి సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అలా సహకరించటం ద్వారా అదానీ, పోస్కోలాంటి వాళ్ళు చొరబడకుండా చేసే సదుద్దేశంతోనే ముందుకొచ్చింది బీఆర్ఎస్. పోనీ ఆ పనేదో వైసీపీ చేసినా సంతోషిస్తారు బాధితులు. ఉదాహరణకు కేరళలోని ''హిందూస్తాన్ పేపర్ లిమిటెడ్''ను కేంద్రం తెగనమ్ముతుంటే, ప్రయివేటు కార్పొరేట్ల పరం కాకుండా పినరరు ప్రభుత్వం రూ.146కోట్లకు తీసుకుని 'కేరళ పేపర్ ప్రొడక్ట్' పేరిట దాన్ని లాభాల్లో పరిగెత్తిస్తూ 7వేల కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడుకున్నది కదా?ఈ సందర్భంగా 'పార్లమెంట్లో వామపక్ష పార్టీల ప్రాతినిధ్యం లేనందువల్లనే మోడీ ప్రభుత్వం దూకుడుకు కనీసం స్పీడుబ్రేకరన్నా లేకుండా పోయిన వనీ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనైనా పార్లమెంటులో కమ్యూ నిస్టుల ప్రాతినిధ్యం ఉండాలనీ కోరుకుంటున్నారు చైతన్యవంతులైన ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీ విధానాలను ధిక్కరించేందుకు సంసిద్ధమైన బీఆర్ఎస్ వంటి పార్టీలతో కలిసి పయనిస్తే అణ గారిన వర్గాల్లో వారి పట్ల మరింత గౌరవం పెరుగుతుంది. నాడు భారత్‌లో బ్రిటిష్ పాలకులు సృస్టించిన వాటికన్నా మిన్నగా, ఆర్థిక అసమానతలను, మత విద్వేషాలను పెంచుతున్న ప్రగతి నిరోధక బీజేపీకి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే పార్టీ కూడా నాడు కౌరవులకు తోడ్పడిన భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది సజ్జనులు కూడా కాలగర్భంలో కలిసిన సత్యాన్ని మననం చేసుకోవటం సర్వశ్రేయోదా యకం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్లే, తమ శ్రేయస్సుతో పాటు, తమ రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పరితపించాలి. ఈ ఉభయ కర్తవ్యాలను నిర్వహించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఉన్నది.
- పాతూరి వెంకటేశ్వరరావు
9849081889