Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓవైపు ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం... మరోవైపు తళుకులీనుతున్న నూతన సచివాలయం... ఇంకోవైపు స్ఫూర్తిని నింపబోతున్న అమరవీరుల జ్యోతి... వెరసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు సరికొత్త కళను సంతరించుకున్నాయి. ఈ మూడింటిని చూసేందుకు ప్రజలు తండోపతంగాలుగా వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్ ముందు ప్రాంతాలను పరిశీలించిన ఓ ఔత్సాహిక పాత్రికేయుడు... ఓ డౌటనుమానం వ్యక్తం చేశారు. అదేంటంటే... ఇటీవల ఫార్ములా వన్ రేసు పేరిట అక్కడి రోడ్లను తవ్వేసి, కొత్త రోడ్లను వేసిన జీహెచ్ఎమ్సీ, ఇప్పడు ఆ కొత్తగా వేసిన రోడ్డును మళ్లీ తవ్వేయటమేంటా..? అన్నది ఆయన అనుమానం. దాన్ని తవ్వటమేగాకుండా మళ్లీ ఆగమేఘాల మీద కొంగొత్త రోడ్డును రూ.కోట్లను వెచ్చించి నిర్మిస్తున్నారు. 'అరే బరు... ఈ మధ్యనేగదా కోట్లు గుమ్మరించి, రోడ్డును వేశారు. మళ్లీ దాన్ని తవ్వేసి, ఇంకో రోడ్డు వేయటం దేనికి... ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటమేకదా..?' అన్నది ఆ జర్నలిస్టు ఆవేదన. ఆయన ఆవేదనలో నిజముందంటారా..? లేదా..?
- కేఎన్ హరి