Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ ఉక్కు కర్మాగారం నడ్డి విరిచి... దాన్ని అర్థకో, పావలాకో అమ్మేందుకు కంకణం కట్టుకున్న మోడీ సర్కార్ అందుకోసం శరవేగంగా పావులు కదుపుతూ ఉన్నది. అక్కడి కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఏకమై పిడికిలి బిగించిన తర్వాత అలాంటి చర్యల నుంచి కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా ఆ సంస్థను కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పటంలో మాత్రం 'తగ్గేదేలే...' అన్నట్టుగా కేంద్రం తీరు ఉండటం యావత్ తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ నుంచి కూడా విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో పాల్గొంటామంటూ ప్రకటనలూ వెలువడటం తెలిసిందే. అయితే ఆయా బిడ్లలో ఆ రెండూ పాల్గొన లేదనుకోండి... అది వేరే విషయం. సరిగ్గా ఈ చర్చ కొనసాగుతున్న సమయంలోనే 'ది గ్రేట్ కేఏ పాల్ అన్న...' సీన్లోకి ఎంటరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేయగల ఏకైక మొనగాణ్ని నేనే నంటూ స్టేట్మెంట్ ఇచ్చి పారేశాడు. ఇది విన్న ఆంధ్రా, తెలంగాణ ప్రజలు... 'బాబ్బాబూ... నీకు పుణ్యం ఉంటుంది. కాస్త ఆ పని చేసి పెట్టు. రెండు రాష్ట్రాలూ నీకు రుణపడి ఉంటాయి. లక్షలాది మంది ఉపాధిని కాపాడిన వాడివవుతావు...' అంటూ పాలన్నను వేడుకుంటున్నారు. కేసీఆర్ అయితేనేం, పాలన్న అయితేనేం... మనకు కావాల్సింది వైజాగ్ స్టీల్‌ను కాపాడుకోవటం. మరి జనం వేడుకోలును పాలన్న ఆలకిస్తాడా..? లేదా..? చూద్దాం... అన్న ఏం చేస్తాడో...
- బి.వి.యన్.పద్మరాజు