Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాలువల నిర్మాణంలో అలక్ష్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

కాలువల నిర్మాణంలో అలక్ష్యం

- ఆయకట్టుకు చేరని నీళ్లు
- అంచనా వ్యయాలు పైపైకి
- ప్రజాధనానికి తూట్లు
- రీడిజైన్ల పేరుతో డీపీఆర్లకు ఎసరు
- అసంపూర్ణంగా సాగునీటి ప్రాజెక్టులు
బి.బసవపున్నయ్య
ఇల్లు అలకగానే పండుగ కాదంటారుపెద్దలు. ఈ నానుడి సాగునీటి ప్రాజెక్టులకు సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ధన దాహాం మూలంగా విలువైన ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ఆపైన ప్రజలపై పదే పదే భారం పడుతున్నది. సాగునీటి ప్రాజెక్టులను సంపూర్ణంగా నిర్మించని ఫలితంగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. పూర్తిస్థాయి ప్రాజెక్టునివేదిక (డీపీఆర్‌) ప్రకారం ప్రాజెక్టులు కడితే ఆర్థికనష్టాలు ఉండవనేది సాగునీటిరంగ నిపుణుల మాట. రాష్ట్రంలో దాదాపు అన్నీ ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లతో కుదు ర్చుకున్న డీపీఆర్‌ ఒప్పందం(అగ్రిమెంట్‌) ప్రకారం లేవు. అందుకే ఆయ కట్టు పూర్తిస్థాయిలో ఉనికిలోకి రాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంపూర్ణ ప్రాజెక్టు అంటే..
   పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) కుదుర్చుకున్నప్పటి నుంచి నిర్ణయించిన రేట్లనే అమలుచేయాలి. నిర్ణీత కాలానికి పూర్తి చేయాలి. అప్పుడే అది ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు అవుతుంది. కానీ భూసేకరణ జరగలేదనీ, బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు అదనపు నిధుల కొరకు వెంపర్లాడుతూ అంచనాల సవరణ(రివైజ్డ్‌ ఎస్టిమేట్లు) పేరుతో డీపీఆర్‌లో ఉన్న మొత్తం కంటే నాలుగైదు రెట్లు పెంచిన ఘటనలు అనే కం. ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూ. 40.15 కోట్లతో ప్రారంభించి రూ. 3000 కోట్లు వ్యయం చేసినా మొదటి దశ పూర్తికాలేదు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, శ్రీరాంసాగర్‌ రెండోదశ తదితర భారీ ప్రాజెక్టులేగాక ఆసీఫాబాద్‌ను ఆనుకుని ఉన్న జగన్నాధపురం ప్రాజెక్టు రూ. 60 కోట్లతో చేపట్టి రెండు దశాబ్ధాలు దాటింది. నేటికి దానికి రూ. 250 కోట్లు ఖర్చుపెట్టినా పూర్తికాకపోవడం తెలిసిందే.
ఎవరెవరు.. ఎంతెంత
   రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే నిర్మాణంలోకి వచ్చాయి. ఆయా రాజకీయ పార్టీల పరిపాలనాకాలంలో నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వపాలనలో రూ. 17 వేల కోట్లు ఖర్చుపెట్టారు. అలాగే వె.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ. 92 వేల కోట్లు వ్యయం చేశారు. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత ఏడేండ్లుగా ఈ సాగునీటి పథకాలపై రూ.1.5లక్షలకోట్లు వెచ్చించారు. అయినా రాష్ట్రంలో ఏఒక్కప్రాజెక్టూ సంపూర్ణంగా నిర్మాణంజరగలేదు.
రివిట్‌మెంట్‌ పనుల నుంచి
   ప్రాజెక్టు పూర్తికావడమంటే ఆ ప్రాజెక్టు డిజైన్‌లో చెప్పినట్టుగా రివిట్‌మెంటుతోపాటు కాలువల లైనింగ్‌ పనులు జరగాలి. లైనింగ్‌ కోసం పూర్తిస్థాయి పరిమాణంతో కూడిన సిమెంట్‌ పనులు జరగకపోతే ప్రాజెక్టు ఆయక ట్టుకు న్యాయం జరగదు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కేవలం 50 క్యూసెక్కులు మాత్రమే కాలువ చివరన ఉన్న ఆయకట్టును చేరుతుంది. దీంతో నీరు వృధా అవడమేగాక ఆయకట్టు నష్టపోతుంది. బ్రాంచ్‌కెనాళ్లు, రివిట్‌మెంటు, లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉంటూనే ఉన్నాయి. కాలువల్లో చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయి నీళ్లు భూమిలోకి ఇంకిపోతున్నాయి. అంతే గాక అవి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయిందని చెప్పాలంటే కాలువలే కీలకం. ఆ పనులను వదిలేసి ప్రభుత్వాలు మాత్రం ప్రాజెక్టులు పూర్త య్యాయని చెబుతుంటాయి. తద్వారా నష్టమే తప్ప లాభం జరగదు.
ఎందుకు అసంపూర్ణం..?
   రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మార తారు. డీపీఆర్లనూ సవరిస్తారు. డీపీఆర్‌ను మార్చకపోతే పాత కాంట్రాక్టర్లనే కొనసాగించాల్సి వస్తున్నది. పాతవారిని తొలగించాలంటే ప్రాజెక్టును రీడిజైన్‌ చేయాలి. అందులో మార్పులు చేస్తూ కొత్త డీపీఆర్‌ను సర్కారు ఆమోదించాల్సి ఉంటుంది. నేటి ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. తద్వారా ప్రజాధనం వృధా అవుతున్నది.
   అవసరం ఉన్నా , లేకున్నా డీపీఆర్లల్లో మార్పులుచేస్తూ తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఆనేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాలు తప్ప, మరే ఇతర లాభం లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
అనుమతులు
   సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాలంటే నాలుగు రకాల అనుమతులు తీసుకోవాలి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అటవీశాఖ, పర్యావరణం, సాంకేతిక అనుమతులు తప్పనిసరి. వీటిలో ఏదీ సరిగ్గా లేకపోయినా ప్రాజెక్టు నిర్మించడానికి వీలుండదు. ప్రభుత్వాలు ముందు, వెనకా అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటాయి.
కాస్ట్‌-బెనిఫిట్‌ రేషియో
   డీపీఆర్లల్లో సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు మార్చడం మూలంగా సవరణ అంచనాలు పెరిగి ఆర్థికభారంతోపాటు నిర్మాణం ఆలస్యమవుతుంది. సాంకేతిక అంశాలు పరిశీలించి నప్పుడు కాస్ట్‌-బెనిఫిట్‌ రేషియో 1:4 లేదా 1:5కు మించ రాదు. అంటే ఏదైనా ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి కనీసం నాలుగైదు సంవత్సరాల్లో తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ నేడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు రెండు దశాద్ధాలు గడిచి నా సర్కారుకు పెట్టిన పెట్టుబడి తిరిగిరావడంలేదు. శ్రీరాం సాగర్‌, జురాల, నాగార్జునసాగర్‌ మినహా మిగిలినా అన్ని ఎత్తిపోతల(లిఫ్ట్‌ ఇరిగేషన్‌)పథకాలే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆలోపుగానీ, ఆ తర్వాతగానీ పంపులు, పైపులు మార్చాల్సి ఉంటుంది. రివిట్‌మెంట్‌, లైనింగ్‌ పనులకు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందవు. చిన్న పథకాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెదర్లాండ్స్‌ దేశం సహకారంతో నిర్మించిన బెక్కెం లిఫ్ట్‌, గూడం, బొడబండ, జటాపూర్‌, కొడూరు, గోపాలపురం, చలపాడు, చిన్నమర్రూర్‌ ప్రాజెక్టులకు పట్టినగతే ఈ లిఫ్ట్‌ పథకాలకూ పడుతుంది.
సర్కారు ఏంచేయాలి ?
   రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి. ప్రాజెక్టులను సత్వరమే చేపట్టి డీపీఆర్‌ ప్రకారం సమయా నుకూలంగా పూర్తిచేయించగలిగితేనే సత్ఫలితాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అగ్రిమెంట్‌ పొడిగించరాదు. ఆమేరకు పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ప్రజాధానం వృధా కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి.
   కాగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు అసం పూర్ణంగానే ఉండటం అందరికి తెలిసిందే. ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు బడ్జెట్‌లో స్పష్టంగా చూపించాలి. పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రహాస్యం ఉండకూడదు. నిధుల నిర్వహణ విషయంలో పారదర్శకత అవసరమని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.