Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త రాజ్యాంగం అవసరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2022

కొత్త రాజ్యాంగం అవసరం

- మతం ముసుగులో దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర
   అదో దిక్కుమాలిన పార్టీ. నదుల అనుసంధానం మిలీనియం జోక్‌. ప్రధాని మోడీది కురచ బుద్ది. ఎల్‌ఐసీని ఎందుకోసం అమ్ముతున్నారు..?. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్‌లా వ్యవహరిస్తారా..?. కేంద్ర బడ్జెట్‌ గోల్‌మాల్‌ గోవిందం. మోడీ సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపితేనే దేశ వికాసం. గుణాత్మక రాజకీయ మార్పు కోసం త్వరలో పాలసీ ప్రకటిస్తా:
- సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశానికి నూతన రాజ్యాంగం అవసరముందనీ, సవరణల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఈవిషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయని అన్నారు. మతపిచ్చి లేపుతూ ధర్మం పేరుతో దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకేనేందుకు యువత నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
   దేశంలో తక్షణం అద్భుతమైన పరివర్తన రావాలని సీఎం సూచించారు. ప్రజల ఆలోచనావిధానంలో మార్పు, దేశ ఆర్ధిక పురోగతికి అవసరమైన సంస్కరణల కోసం ప్రాణాలు లెక్కచేయకండా పోరాటం చేస్తానని చెప్పారు. ఈ ప్రయాణంలో తనతో కలిసొచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో మాట్లాడానని, త్వరలో మహారాష్ట్ర సీఎంను కూడా కలవనున్నట్టు చెప్పారు. అతికొద్ది రోజుల్లోనే నూతన రాజకీయ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఆ బడ్జెట్‌ గోల్‌మాల్‌ గోవిందం అని ఎద్దేవా చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, రైతులు, నేతన్నలు, రైతు కూలీలు,వృత్తిదారులు, కార్మికులు, ఉద్యోగులకు ఈ బడ్జెట్‌ తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. దానికి దశా, దిశా లేదని కొట్టిపారేశారు. పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌ అని చెప్పారు. వ్యవసాయం, విద్య,వైద్యం, ఉపాధి హామీ,సాంఘిక, సంక్షేమ రంగాలకు కేంద్రం నిధుల కోత విధించిందని తెలిపారు.
   మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాలు చదివి బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్‌.. ఆద్యంతం అధర్మ ప్రవచనాలను వల్లె వేశారని విమర్శించారు. ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను వంచించేలా ఆమె బడ్జెట్‌ ప్రసంగం సాగిందన్నారు. దేశంలో దళితులు, గిరిజనులు సుమారు 40కోట్ల మంది ఉంటే వారి సంక్షేమానికి కేవలం రూ.12,800 కోట్లు కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా రైతు మహోద్యమం జరిగితే బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ రంగానికి ఉద్దీపనలు లేకపోగా ఎరువులపై సబ్సిడీకి కేంద్రం భారీగా కోత కోసిందన్నారు. మద్దతు ధరల (ఎమ్మెస్పీ) బిల్లు ప్రస్తావన లేదని, విద్యుత్‌ సంస్కరణలపై వెనక్కి తగ్గినట్లు కూడా బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీకి నిధుల కేటాయింపులు తగ్గాయని వివరించారు. దొంగ సోషల్‌ మీడియాతో అబద్దాలు ప్రచారం చేసుకున్న మోడీ బండారం ఎనిమిదేండ్లలో బయట పడిందని విమర్శించారు. అందువల్ల బీజేపీ దరిద్రపుగొట్టు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిళించి బంగాళాఖాతంలో పడేస్తేనే దేశం వికసిస్తుందని సీఎం అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తేనే సాధ్యమని, ఈవిషయంలో యువత ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
   'బీజేపీ అంటే దేశాన్ని అమ్ముడు-మత చిచ్చు లేపుడు - రాజకీయంగా పబ్బం గడుపుకొనుడు-మందిమీద పడి ఏడ్చుడు...' అని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఆకలి సూచిలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ కంటే మనం దిగువన ఉన్నా..కేంద్రం రూ.65వేల కోట్ల మేర ఆహార సబ్సిడి కోత విధించటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అమ్ముతున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడంపై కేసీఆర్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎవరి ప్రయోజనాలను ఆశించి ప్రగతిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ప్రశ్నించారు. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారా..? అని ప్రధాని మోడీని నిలదీశారు. 'ఏం దందా ఇది...?' అంటూ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి పెట్టుబడిని రెట్టింపు చేశారు. అందరికీ ఇల్లు అన్నారు..ప్రతి ఇంటికీ రూ.15లక్షలు ఇచ్చారా..? నల్లధనం సంగతేంటి..? 15 లక్షల ఉద్యోగాలెక్కడ..? మీరిచ్చిన ఒక్క మాట మీదైనా నిలబడ్డారా...?' అంటూ ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అహ్మదాబాద్‌లో ఆర్బిట్రేటర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మోడీ మరోసారి తన కురచ బుద్ధిని చాటుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఆర్బిట్రేటర్‌ సెంటర్‌కు నిధులు కేటాయించాల్సింది పోయి..పోటీగా శిఖండిని తెచ్చిపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్‌ యువత, మేధావులు ఈ అంశంపై మేథావులు ఆలోచించాలని కోరారు. క్రిప్టో కరెన్సీపై 30శాతం పన్ను వసూలు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడంపై సీఎం విస్మయం వ్యక్తంచేశారు.
   గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానాన్ని మిలీనియం జోక్‌గా కేసీఆర్‌ అభివర్ణించారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని గోదావరి, కావేరి జలాలను కలుపుతారు..? గోదావరి జలాలపై తెలంగాణ, ఏపీలకే హక్కు ఉంది. గోదావరిపై ట్రిబ్యునల్‌ తీర్పు ఉన్న సంగతి తెలియదా..? నదుల అనుసంధానం తెలివితక్కువ నిర్ణయం కాదా..? గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రతిపాదనలు ఎందుకు పరిష్కరించడంలేదు..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో నీళ్ల యుద్దాలకు, తాగునీటి సమస్యలకు కేంద్ర విధానాలే కారణమని స్పష్టంచేశారు. బీజేపీ వంటి సిగ్గుమాలిన పార్టీ, ఇటువంటి దుర్మార్గ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని అన్నారు. ముచ్చింతల్‌లో చిన్నజీయర్‌ అనుచరులు సమతామూర్తి విగ్రహం పెడితే..దాన్ని కూడా మోడీ ఏర్పాటు చేసినట్టు బీజేపీ దొంగ సోషల్‌ మీడియాలో నిర్లజ్జగా ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్దాలు చెప్పే గొప్ప మోసగాళ్లనీ, వారికి సామాజిక బాధ్యత లేదన్నారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌,ఐపిఎస్‌,ఐఎఫ్‌ఎస్‌ అధికారుల సమావేశం త్వరలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ అన్ని అంశాలపై చర్చిస్తామని తెలిపారు. త్వరలో ఐదు తరాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను లోక్‌సభ ఎలక్షన్లకు సెమీఫైనల్‌గా పరిగణించలేమన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ వేషధారణ, ట్రిక్కులు ప్రయోగించడం మోడీకి పరిపాటిగా మారిందని సీఎం ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. యూపీలో బీజేపీ ప్రభ నానాటికీ తగ్గుతున్నదని చెప్పారు. బీజేపీ విధానాలపై దేశం స్పందించాల్సిన (రియాక్ట్‌్‌) సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర విధానాలపై ప్రజలు, యువత ఉద్యమించాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.