Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిర్వీర్యం దిశగా.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2022

నిర్వీర్యం దిశగా..

- కేంద్ర బడ్జెట్‌లో 'ఉపాధి హామీ'కి ఏటా కోతే!
- 2009-10లో రూ.10లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.40వేల కోట్లు కేటాయిస్తే..
- ఈ ఏడాది రూ.40లక్షల కోట్లలో కేటాయించింది రూ.75కోట్లు మాత్రమే!
- అదీ ఏడాదిలో సగటు పని దినాలు 42రోజులే!
- రోజుకు కూలీకి గిట్టుబాటయ్యేది సగటున రూ.170
- గ్రామాలను విలీనం చేస్తూ 'ఉపాధి'కి తూట్లు
- ఉమ్మడి కరీంనగర్‌లో అలా ఉపాధి కోల్పోయింది 70 గ్రామాలపైనే..
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వామపక్షాల ఒత్తిడితో యూపీఎ-1లో తీసుకొచ్చిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే దిశగా ఏటా బడ్జెట్‌లో కోతలు విధిస్తూ వస్తోంది. 2009లో కేంద్ర బడ్జెట్‌ రూ.10లక్షల కోట్లలో ఉపాధి హామీకి రూ.40వేల కోట్లు (4శాతం) కేటాయించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన రూ.39.44లక్షల కోట్ల బడ్జెట్‌లో వాస్తవానికి రూ.లక్షా 57వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, గతేడాది రూ.98వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ.73వేల కోట్లే కేటాయించింది. ఇప్పటికే సగటున 48రోజుల పని మాత్రమే దొరుకుతుండగా.. రోజుకు రూ.170 కూడా గిట్టుబాటుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఏడాదికేడాది నిధుల కోత విధిస్తుంటే ఆ మాత్రం పనులూ దొరికే పరిస్థితి లేదు. పైగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా రెండు కార్పొరేషన్లు, 14మున్సిపాలిటీల్లో విలీనమైన సుమారు 70 గ్రామాలు ఇప్పటికే 'ఉపాధి'ని కోల్పోయాయి. ఈ నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆసాంతం కార్పొరేటర్లకు రాయితీలు, లబ్ది చేకూర్చే అంశాలే ప్రధానంగా ఉన్నాయి.
   ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఒక్క బలమైన అంశమూ బడ్జెట్‌లో లేదు. పైగా గ్రామీణ పేదలకు ఎంతో కొంత పని కల్పిస్తున్న ఉపాధి హామీనీ నిర్వీర్యం చేస్తూ గతేడాది కంటే రూ.25వేల కోట్లకు కోత విధించింది. 2009లోనే రూ.10 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు అనగా నాలుగు శాతం కేటాయించగా.. ప్రతియేటా కోతలు విధిస్తూ వస్తోంది. 2019-20లో 30లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.61వేల కోట్లే విధించిన కేంద్ర సర్కారు.. గతేడాది రూ.98వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఏకంగా రూ.25వేల కోట్ల కోత విధిస్తూ కేవలం రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ పరిణామాలు ఆ ఏడాదిలో పని కల్పించే ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
   ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 5,52,932కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా.. 2021-22 ఏడాదికిగాను ఇప్పటివరకు 2,51,677 కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఏడాదిలో వంద రోజుల పనికిగాను సగటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48రోజులే పని కల్పించగా.. రోజుకు రూ.170 కూలి గిట్టుబాటు కాలేదు. రెక్కలు, ముక్కలు చేసుకుని పనిచేస్తే దానికీ సరిగా వేతనాలు చెల్లించడం లేదు. చట్టం ప్రకారం రోజుకు రూ.211 కూలి చేతికి అందడం లేదు. సగటు కూలి రూ.151 నుంచి రూ.170 వరకు పడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో రూ.125 కూడా దక్కట్లేదని సర్వేలు చెబుతున్నాయి.
'ఉపాధి' లేకుండా చేస్తున్నారు
గుడికందుల సత్యం, సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
   దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పన ఊసే లేకపోగా.. గ్రామీణ పేదలకు పని కల్పించే 'ఉపాధి'నీ లేకుండా చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఉపాధి హామీకి రూ.25వేల కోట్లు కోత విధిస్తే.. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.35వేల కోట్లు కోత విధించారు. బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదల జీవితాలతో చలగాటం ఆడుతోంది.
ఎక్కడి సమస్యలు అక్కడే..
   ఉపాధి హామీ చట్టం నిర్వహణలో అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. పని ప్రదేశాల్లో కూలీలకు దెబ్బతగిలితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రతి గ్రూపునకూ మెడికల్‌ కిట్లు ఉండాలి. ఇది చట్ట నిబంధన. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అమలు కావ డం లేదు. గడ్డపారలు, పారలు, ఇతర పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పనిప్రదేశాల్లో టెంట్లు ఇవ్వాల్సి ఉండగా.. వేడిని ఎక్కువగా గ్రహించే టార్పాలిన్‌ కవర్లను అందిస్తున్నారు. ఇక వేసవిలో అదనంగా ఇవ్వాల్సిన అలవెన్సులకు కేంద్రం కోతపెట్టే ఆలోచనలో ఉన్నట్టూ తెలుస్తోంది.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన 'ఉపాధి' వివరాలు
జిల్లా పని కల్పించిన వందరోజుల పనిలో రోజుకు కూలీకి ఇచ్చిన
కుటుంబాలు సగటు పనిదినాలు సగటు వేతనం
కరీంనగర్‌ 62621 42రోజులు రూ.153
పెద్దపల్లి 56659 42రోజులు రూ.173
సిరిసిల్ల 51968 48రోజులు రూ.202
జగిత్యాల 80429 40రోజులు రూ.188
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటివరకు ఆయా కుటుంబాలకు ఇచ్చిన జాబ్‌కార్డులు, కూలీల వివరాలు
జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు కూలీలు
కరీంనగర్‌ 155738 43160 1545 94958 16075 328917
పెద్దపల్లి 125143 27485 3068 87097 7492 269568
సిరిసిల్ల 106351 28163 7216 59946 11026 230291
జగిత్యాల 165700 41752 7168 104300 12480 297962

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.