Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో మాట్లాడిన తీరును రాష్ట్ర మంత్రులు ఖండించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ప్రజలు వీరోచితంగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే వారి త్యాగాలను మోడీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు.