Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధ్యాయులపై ఉక్కుపాదం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 10,2022

ఉపాధ్యాయులపై ఉక్కుపాదం..

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసన తెలిపే హక్కును కాలరాసింది. 317 జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద బుధవారం తలపెట్టిన మహాధర్నా నిర్బంధాల మధ్యే జరిగింది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇందిరాపార్క్‌ వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయినా 317 జీవో బాధిత ఉపాధ్యాయులు భారీగా తరలొచ్చారు. చంటిపిల్లలతో మహిళా టీచర్లు హాజరు కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. వారి నినాదాలతో ధర్నాచౌక్‌ దద్దరిల్లింది. ఉపాధ్యాయుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు. '317 జీవోను సవరించాలి, విరు వాంట్‌ జస్టిస్‌, సీనియార్టీ మాత్రమే వద్దు, స్థానికత ముద్దు, భార్యాభర్తలను కలపండి, విడదీయొద్దు, భార్య ఒక జిల్లా?, భర్త ఒక జిల్లా?'అంటూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, యూ పోచయ్య, ఎస్‌ హరికిషన్‌, జాదవ్‌ వెంకట్రావు, ఎన్‌ యాదగిరి, టి విజయసాగర్‌, బి కొండయ్య, ఎస్‌ మహేష్‌, వై విజయకుమార్‌ తదితరుల నేతత్వంలో బుధవారం వందలాది మంది ఉపాధ్యాయులు దోమలగూడ రోడ్డు నుంచి ప్రదర్శనగా ధర్నాచౌక్‌ వద్దకు తరలివచ్చారు. ప్రారంభంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు విడతల వారీగా ధర్నాచౌక్‌కు తరలొచ్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్‌, చిక్కడపల్లి, బేగంబజార్‌, అబిడ్స్‌, రాంగోపాల్‌ పేట, సైఫాబాద్‌, నాంపల్లి, నారాయణగూడ, అంబర్‌పేట, ముషీరాబాద్‌, బొల్లారం పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచే వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు డి సైదులు, షౌకత్‌ అలీ, ఎ గంగాధర్‌ తదితరులూ జిల్లాల్లో అరెస్ట్‌ అయ్యారు. 'కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్థానికత కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చింది. ఉద్యమం చేయకుండానే తెలంగాణ వచ్చిందా?. యూఎస్‌పీసీ మహాధర్నా అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదు. 317 జీవో బ్రహ్మాండంగా ఉంటే ఉపాధ్యాయులు ఇంత పెద్దఎత్తున హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ దీపిపై పరిశీలించాలి. మేం పాఠాలు చెప్తేనే మీరు పోలీసులయ్యారు. మమ్మల్ని అడ్డుకోవడం, అరెస్టు చేయడం సమంజసం కాదు. మా అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి'అంటూ పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలి :
చంటి బిడ్డతో హాజరైన మహిళా ఉపాధ్యాయురాలు
'నేను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సూరారంలో పనిచేశాను. నన్ను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పక్కన చౌదరిగూడ మండలంకు బదిలీ చేశారు. ఇదెక్కడి న్యాయం. శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుంచి వచ్చిన వారు హాయిగా ఉన్నారు. మేం స్థానికులం. మాకు అన్యాయం జరుగుతున్నది. స్థానికతకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలి. కానీ స్థానికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేం స్థానికేతరులం అయ్యాం, వారు స్థానికులయ్యారు. ఇది అన్యాయం. చిన్న బాబు ఉన్నారు. కుటుంబంతో అక్కడికి ఎలా వెళ్లాలి. 120 కిలోమీటర్లు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉన్నది. నన్ను మేడ్చల్‌ జిల్లాకు కేటాయించాలి.'అని బాధిత మహిళా టీచర్‌ అన్నారు.
బాధిత టీచర్లకు న్యాయం చేయాలి : యూఎస్‌పీసీ నేతలు
ధర్నాచౌక్‌తోపాటు పోలీస్‌స్టేషన్లలో ఉన్న యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ నేతలు చావ రవి, కె జంగయ్య, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, కె రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును నిరాకరించడం సరైంది కాదని విమర్శించారు. అధికార పార్టీ నిరసనలను దగ్గరుండి జరిపించిన పోలీసులు ఉపాధ్యాయుల శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన వారు, సీనియార్టీలో లోపాలు, ఎస్సీ,ఎస్టీ సామాజిక తరగతులకు దామాషా పాటింపులో పొరపాట్లు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అంతర్‌జిల్లా బదిలీలో జిల్లాలు మారిన వారు, భార్యాభర్తలు తదితర కేటగిరీలకు జరిగిన నష్టాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్‌ చేశారు.
పరస్పర బదిలీలకు ఇచ్చిన 21 జీవోను సవరించాలని కోరారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
మానసికంగా కుంగిపోతున్నా
'నేను కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో పనిచేశాను. ఇప్పుడు జగిత్యాలకు కేటాయించారు. మా సొంతూరు నుంచి 190 కిలోమీటర్లు వెళ్లి ఎలా పనిచేయాలి. కుటుంబాన్ని మార్చడం సాధ్యం కాదు. మానసికంగా కుంగిపోతున్నా. సీనియార్టీతోపాటు స్థానికత ఆధారంగా కేటాయింపులు చేస్తే బాగుండేది. ఈ జీవోను సవరించాలని కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నా స్థానికత హన్మకొండ జిల్లా. కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపారు. అందుకే నన్ను ఈ జిల్లాకు కేటాయించాలి.'అని వేణుమాధవ్‌ కోరారు.
- వేణుమాధవ్‌
ఒంటరి మహిళను అంతదూరం ఎలా వెళ్లాలి?
'నేను శంషాబాద్‌ పక్కన ముచ్చింతల్‌ మండలంలో తొమ్మిదేండ్లు పనిచేశాను. ఇప్పుడు నన్ను వికారాబాద్‌కు కేటాయించారు. అదీ కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బషీరాబాద్‌ మండలానికి బదిలీ చేశారు. జూనియర్‌ అనే పేరుతో పంపించారు. మా పాప సికింద్రాబాద్‌లో సెయింట్‌ ఆన్స్‌లో ఆరో తరగతి చదువుతున్నది. పాపను తీసుకుని ఒంటరి మహిళను అంతదూరం ఎలా వెళ్లాలి?. 145 కిలోమీటర్లు వెళ్లడం ఎలా?. ఉదయం 5.55 గంటలకు రైలులో వెళ్లాలి. రాత్రి తొమ్మిది తర్వాత ఇంటికి రావాల్సి వస్తున్నది. మా అమ్మాయి భద్రత, చదువు ఎవరు చూడాలి. నేను అప్పీల్‌ చేసుకున్నా నెలదాటినా పరిష్కారం కాలేదు. ఈ బదిలీ వల్ల నాకు గుండెనొప్పి వస్తున్నది. నన్ను మేడ్చల్‌ జిల్లాకు కేటాయించాలి.'అని హిందీ పండిట్‌ విజయ ఆవేదన వ్యక్తం చేశారు.
- విజయ
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి
ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇస్తే బాగుండేదని చెప్పారు. 1.08 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 1.04 లక్షల మంది జిల్లా కేటాయింపుల్లోనే ఉన్నారని వివరించారు. దీంతో 317 జీవో వల్ల ఇబ్బంది కలిగిన వారిలో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. వారు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే కారణమన్నారు. పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడిందనీ, రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలనీ, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఉద్యోగులూ వలస వెళ్తున్నారు
'మేడ్చల్‌ నుంచి రంగారెడ్డి జిల్లాకు కేటాయించారు. సొంత జిల్లాలోనే వలస వెళ్లాల్సి వస్తున్నది. స్థానికులకు ఎక్కడ న్యాయం జరుగుతున్నది. ఉపాధి లేక కాదు, ఉద్యోగం ఉన్నా వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మా బాధ పట్టించుకునే వారు లేరు. మాకు న్యాయం చేయాలి. స్థానికత ఉన్న జిల్లాకే కేటా యించాలి.'అని అరుణేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
- అరుణేశ్వరి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.