Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదరం.. బెదరం.. ఆర్టీసీ మాదే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 13,2022

అదరం.. బెదరం.. ఆర్టీసీ మాదే

- సంస్థ పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం దేనికైనా సై...
- ఉధృతంగా టీఎస్‌ఆర్టీసీ జేఏసీ సంతకాల సేకరణ కార్యక్రమం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రగతి రధ చక్రాల కిందపడి నలిగిపోతున్న బడుగుజీవులు ఆర్టీసీ కార్మికులు. నమ్ముకున్న సంస్థ తమ కష్టాన్ని పట్టించుకోకున్నా, ఒళ్లు దాచుకోకుండా కష్టపడే మనస్తత్వం వారి సొంతం. 55 రోజులు సమ్మె చేసి సహనాన్నే ఆయుధంగా సంధించిన చరిత్ర వారిది. హక్కులు, ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం పోరాటాన్నే ఊపిరిగా మార్చుకున్న ధీరులు వారు. తాత్కాలికంగా వారికి కష్టం వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ, అణచివేతను సహిస్తున్నారే తప్ప, సమరశీల పోరాటాన్ని వీడలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం తమ డిమాండ్లను, కష్టాలను పట్టించుకోవట్లేదనే ఆవేదనలోంచే వారి ఆందోళనలు రూపొందుతున్నాయి. టీఎస్‌ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేవు... అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి బలంగా ఢకొీట్టేందుకు సిద్ధపడుతున్నారు. మాకు సంఘాలే కావాలంటూ నినదిస్తున్నారు. మీ సంక్షేమ మండళ్లతో మాకు ఒరిగిందేంలేదంటూ సమస్యల చిట్టాలు విప్పుతున్నారు. టీఎస్‌ఆర్టీసీలోని తొమ్మిది కార్మిక సంఘాల నేతృత్వంలో ఏర్పడిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపుతో సంఘాలకు అతీతంగా కార్మికులు స్పందిస్తున్నారు. ''రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు లేవన్నారు. నిరీక్షించాం. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు జరపట్లేదు'' అంటూ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని, కార్మిక శాఖనూ ప్రశ్నిస్తున్నారు. జేఏసీ పిలుపులో భాగంగా ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరగుతున్నది. దానికి కార్మికుల నుంచి విశేష స్పందన వస్తున్నది. కొన్ని డిపోల్లో వందశాతం, మరికొన్ని డిపోల్లో 90 శాతం మేర కార్మికులు సంతకాల సేకరణలో భాగస్వాములు అయ్యారు. తమ పేరు, స్టాఫ్‌ నెంబర్‌, హౌదాలను పేర్కొంటూ నిర్భయంగా సంతకాలు చేస్తున్నారు. 2017, 2021 ఏప్రిల్‌ 1 నుంచి తమకు రావల్సిన రెండు వేతన సవరణలు ఎందుకు చేపట్టలేదో చెప్పండంటూ అక్షరాల అగ్నికణికలు మండిస్తూ సంతకాలు చేస్తున్నారు. సంపూర్ణ ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ ఎక్కడంటూ నల్ల సిరాతో నిరసన సంతకాలు చేస్తున్నారు. 2019 నుంచి రావల్సిన ఆరు డిఏలు, 2013 వేతన సవరణలో 50 శాతం పాత బకాయిల బాండ్లకు డబ్బులు ఎప్పుడిస్తారనీ అడుగుతున్నారు. మా జీతాల్లో నుంచి దాచుకున్న కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ సొమ్మును వాడుకోవడానికి మీకేం అధికారం ఉందంటూ యాజమాన్యంపై నల్లసిరా చల్లుతున్నారు. యూనియన్లు కావాలంటూ అక్షరాయుధాలను సంతకాల రూపంలో చెక్కుతున్నారు. తాము సంతకాలు పెట్టిచ్చిన కాగితాలను కార్మిక శాఖ కమిషనర్‌, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యానికి ఇవ్వండంటూ జేఏసీని కోరుతూ కార్మిక ఐక్యతను చాటుతున్నారు.
ఇది కార్మికులే కోరుకున్న పోరు
వీఎస్‌ రావు, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌
   మూడేండ్ల క్రితం ఏ డిమాండ్ల సాధన కోసమైతే 55 రోజులు సమ్మెచేశామో...అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటికి కొత్త డిమాండ్లు జోడయ్యాయే తప్ప, ఎలాంటి పరిష్కారాలు లభించలేదు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ మండళ్లు సాధించింది ఏమీ లేదు. కార్మికులపై పనిభారాలతో పాటు ఆర్థిక ఇబ్బందులూ పెరిగాయి. అత్యంత అనిశ్చితి, అవేదన, ఆందోళనల మధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వాటిలోంచే మరో స్వచ్ఛంద కార్మికోద్యమం పుట్టుకొస్తున్నది. దానికి ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక శాఖలే బాధ్యత వహించాలి.
ఎన్నికలు నిర్వహించాలి
కే రాజిరెడ్డి, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మెన్‌
   రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులతో ఆత్మీయ సమ్మేళ నంలో చెప్పారు. ఆ గడువు ముగిసింది. తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. యూనియన్లు లేవని ఆయన కేవలం మౌఖికంగా చెప్పారే తప్ప, దానికెలాంటి చట్టబద్ధత లేదు.
చట్టాలను తుంగతో తొక్కారు
కే హన్మంతు ముదిరాజ్‌, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ వైస్‌ చైర్మెన్‌
   చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. రాజ్యాంగం పట్ల కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నది. సింగరేణి కాలరీస్‌లో బొగ్గుగని కార్మిక సంఘం ఉంటుంది... దానికి సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉంటారు. మరి ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఎందుకు ఉండొద్దో సీఎం కేసీఆర్‌ చెప్పాలి.
వేతన సవరణ ఎందుకు చేయరు?
పి కమాల్‌రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌
   2015లో ఇచ్చిన 44 శాతం ఫిట్‌మెంట్‌ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగలేదు. అప్పటికీ ఇప్పటికీ డీజిల్‌, పెట్రోల్‌ రేట్లతో పాటు నిత్యవసర వస్తువుల ధరలూ పెరిగాయి. ఆరు డిఏలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంది. ఇంకెంతకాలం ఓపికపట్టాలి. మా సహనానికీ హద్దుంటుంది.
రిటైర్డ్‌ కార్మికుల సెటిల్‌మెంట్లూ ఇవ్వట్లేదు
జీ అబ్రహం, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో- కన్వీనర్‌
   రిటైర్డ్‌ కార్మికుల సెటిల్‌మెంట్లు కూడా యాజమాన్యం ఇవ్వట్లేదు. 30-35 ఏండ్లు సంస్థ కోసం కష్టించి పనిచేసి, 60 ఏండ్ల వయసులో ఉద్యోగ విరమణ చేశాక, వారికి సంస్థ నుంచి రావల్సిన బెనిఫిట్స్‌ ఇచ్చేందుకు ఏండ్లతరబడి తిప్పించుకోవడం ఎంతవరకు న్యాయం. ప్రభుత్వం ఆలోచన చేయాలి.
వేధింపులు బంద్‌ చేయాలే..
కే యాదయ్య, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌
   కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతున్నారు. కొత్త బస్సుల కొనుగోళ్లే లేవు. పాత బస్సులకు కిలోమీటర్‌ పర్‌ లీటర్‌ (కేఎమ్‌పీఎల్‌) తక్కువ వస్తుందని కార్మికులను వేధిస్తున్నారు. బస్సులు సక్కంగా లేకుంటే డ్రైవర్లేం చేస్తారు? ఆర్టీసీ ఉద్యోగం కత్తిమీది సాములా తయారైంది.
ప్రభుత్వంలో విలీనం చేయాలి
బీ సురేష్‌, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌
   టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లించాలి. సంస్థకు బడ్జెట్‌లో రెండుశాతం గ్రాంటు ఇవ్వాలి. చనిపోయిన, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి.
డీజిల్‌పై పన్నులు మినహాయించాలి
పీ హరికిషన్‌, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌
   పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్ని తగ్గించాలి. సంస్థ అప్పుల్ని ఈక్విటీగా మార్చాలి. డ్యూటీకి రిపోర్టు చేస్తే హాజరు ఇవ్వాలి. ఓవర్‌టైం భత్యం చెల్లించాలి. అక్రమ రవాణాను నిరోధించాలి.
మహిళా ఉద్యోగులపై వేధింపులు
బీ యాదగిరి, టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌
   సంస్థలో మహిళా ఉద్యోగులు వివిధ రూపాల్లో వేధింపులకు గురువుతున్నారు. తక్షణం సంస్థలో మహిళా కమిటీలను పునరుద్ధ రించాలి. మహిళా కండక్టర్లకు రాత్రి 8లోపు డ్యూటీలే వేయాలి. డిపోల్లో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ మహిళా ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటికీ అమలు కాలేదు. విచారకరం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.