Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడవిలో కుట్ర ! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 20,2022

అడవిలో కుట్ర !

- యురేనియం కోసం అడవి బిడ్డలను తరలించేందుకు యత్నం
- కొల్లంపేట, కొమ్మనపేటలో అలజడి

- అంగీకార పత్రాలు రాయించుకునే పనిలో అటవీ అధికారులు
- చావనైనా చస్తాంగానీ అడవిని వీడమంటున్న ఆదివాసులు
- గిరిజన, గిరిజనేతరుల మధ్య చిచ్చు
   అడవిలో పుట్టాం, అడవిలోనే చస్తాం. ఉన్నట్టుండి మాపై మీకెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఆకలైతే అన్నం పెట్టారా ?.. రోగం వస్తే ఆస్పత్రిలో చేర్పించారా ?.. మా భాష వేరు, మా బతుకు వేరు. ఏనాడూ మీపై ఆధారపడి బతకలేదు. అడవి తల్లే మాకు అన్నీ ఇచ్చింది. మీతో మాకు సంబంధం లేదు. అయినా అడవిని వదిలి బస్తికి రమ్మనడంలో ఆంతర్యమేమిటి ?.. మీరిచ్చే లక్షలు మా బతుకులను బాగు చేయవు.. యురేనియం కోసమే మమ్మల్ని పంపే కుట్రలకు పాల్పడుతున్నారా ?.. అడవిలో ఉన్నప్పుడే ఆదుకోలేదు. ఇక అడవిని వదిలితే బతకనిస్తారా?'' అంటూ కొల్లంపేటకు చెందిన గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
అడవి గడప దాటని ఆదివాసులను తమ స్వప్రయోజనాల కోసం పాలకులు అటవీ శాఖ సాయంతో తరలించే కుట్రలు చేస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర వసంతాలు కావస్తున్నా నేటికీ అడవి బిడ్డల ఆకలి తీర్చింది లేదు.. వారేం తింటున్నారో.. ఎలా బతుకుతున్నారో.. అంతా ఆ అడవి తల్లికే తెలుసు. అంతరిస్తున్న ఆదిమ జాతి మనుగడ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడిందీ లేదు.. ఉన్నట్టుండి ఇప్పుడు వారిపై పాలకులు, అధికారులకు వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. లక్షల రూపాయలు ఇస్తాం.. బస్తీకి వెళ్లిపోవాలంటూ బలవంతం చేస్తున్నారు. పాలకులు యురేనియం కోసం చెంచులను అడవి నుంచి తరలించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గూడేల్లో అటవీ అధికారులు రహస్యంగా అంగీకార పత్రాలు రాయించుకునే పనిలో నిమగమయ్యారు. ఈ క్రమంలో నేటికీ ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులు చావనైనా చస్తాంగానీ అడవిని వదిలేది లేదంటున్నారు. అయినా పాలకులు, అధికారులు మొండి పట్టు వీడటం లేదు. అటవీ ప్రాంతంతో పాటు వన్యప్రాణుల సంరక్షణలో భాగమైన చెంచులను తరలిస్తే భవిష్యత్‌ అంధకారం కానుంది.
   నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అచ్చంపేట, బల్మూరు, పదర, మన్ననూరు, కొల్లాపూర్‌ లింగాల తదితర మండలాల్లో వటవర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, మల్లాపూర్‌, అప్పాపూర్‌, బౌరాపూర్‌, రాంపూర్‌, సంగడి గుండాల, మేడిమలక్కల, ఈర్లపెంటతో పాటు దాదాపు 112 చెంచుపెంటలున్నాయి. 2,630 కుటుంబాలుండగా 9500 మంది చెంచులున్నారు. ఆహార సేకరణతో పొట్ట నింపుకుంటున్న చెంచులు నేటికీ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు అటవీ సంరక్షణ, మరోవైపు వన్యప్రాణుల పరిరక్షణకు పాటుపడుతూ జీవన గమనాన్ని నెట్టుకొస్తున్నారు. నేటికీ వీరు విద్య, వైద్యానికి అందనంతం దూరంలో ఉన్నారు.
యురేనియం కోసమే తరలింపు ?
    భారతదేశంలోనే పెద్ద పులుల అభయారణ్య ప్రాంతంగా నల్లమల ప్రసిద్ధి. వీటి పరిధిలో యురేనియం నిక్షేపాలున్నాయని గుర్తించిన పాలకులు వెలికి తీసే కుట్రలు చేస్తున్నారు. రహస్యంగా అడవిలో రాచబాట వేశారు. కానీ, ఆదివాసులు, ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా యురేనియం తవ్వకాల కోసం బోర్లు వేశాక నెమ్మదించారు. మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. మన్ననూర్‌ దాటిన తర్వాత శ్రీశైలం రహదారిలోని కొల్లంపెంట బేస్‌ క్యాంపు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొల్లంపెంట గూడెం ఉంది. ఈ ప్రాంతంలో నిత్యం పెద్ద పులులు సంచరిస్తాయి. అక్కడ వాటితో సహజీవనం చేసే చెంచులను.. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల రక్షణ ముసుగులో అక్కడి నుంచి తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వీరి వెనుక బడా పారిశ్రామికవేత్తలు, నేతలున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్తే అభివృద్ధి చెందుతారని, వచ్చిన వారికి ఆర్థిక సాయం కూడా చేస్తామని నమ్మించి వారం కిందట రహస్యంగా వారి నుంచి సంతకాలు సేకరించారు. వారికి మద్యం తాగించి సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం. శ్రీశైలం వెళ్లే దారిలో ఉండే పరహాబాద్‌ దగ్గర గల కొమ్మనపెంట చెంచులను కూడా ఇలాగే తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
చెంచులకు అడవిలోనే రక్షణ..
శంకర్‌ నాయక్‌- గిరిజన సంఘం జిల్లా నాయకులు- నాగర్‌కర్నూల్‌
   చెంచులకు అడవిలోనే రక్షణ ఉంటుంది. అడవి జీవితానికి అలవాటుపడిన వారిని పాలకులు తమ స్వప్రయోజనాల కోసం తరలించడం సరికాదు. వారు జన జీవనంలో ఉండలేరు. అడవిని నాశనం చేసే మాఫియాను వదిలి.. అడవి బిడ్డలను ఆగం చేయాలనుకోవడం దుర్మార్గం. ప్రభుత్వాలు ఇలాంటి పనులు మానుకోవాలి. లేకుంటే చెంచులను సమీకరించి ఉద్యమిస్తాం.
లక్షలు మా బతుకులను బాగుచేయవు..
   మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అడవిని నమ్ముకుని బతుకు లీడుస్తున్నాం. తమను ఇక్కడి నుంచి వెళ్లగొట్టే కుట్రలు చేస్తున్నారు. చావనైనా చస్తాంగానీ అడవిని మాత్రం వదలం. అడవిని వదిలితే లక్షలిస్తామన్నారు. కానీ ఆ లక్షలు మా బతుకులను బాగు చేయలేవు.
- లింగయ్య- కొల్లంపెంట- అమ్రాబాద్‌ మండలం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.