Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు పొన్నాల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించి ఇప్పుడు దేశాన్ని కూడా భ్రష్టుపట్టిస్తారా? అని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. దేశానికి నాయకత్వం వహించేందుకు కేసీఆర్‌కు ఉన్న బలమెంత అని ఎద్దేవా చేశారు.మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ చెబుతున్న బంగారు భారత్ నినాదం హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. కూట్లో రాయి తీయలేని వాడు...ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారముందని ఎద్దేవా చేశారు. ఆయన అనుకుంటున్న థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోతుందని చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన సీఎం ... ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లపాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని నిలదీశారు.