Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పింఛన్‌ అందేదెన్నడో? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 25,2022

పింఛన్‌ అందేదెన్నడో?

- అయ్యో అనోటోల్లే తప్ప ఇప్పించేటోళ్లు లేకపాయే... ఆసరా కోసం ఎదురుచూపులు
- 65 ఏండ్లకుపైన, ఇతరులు ప్రతి నెలా నష్టపోతున్నది 69 కోట్లకుపైనే
- 57 ఏండ్లకుపై వారిని కలుపుకుంటే అది వందల కోట్లలోనే ఇవ్వాల్సిన వైనం
- నిధులు లేకనే సర్కారు తాత్సారం !
- మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల చుట్టూ తిరిగినా దక్కని పింఛన్లు
- కొత్తగా అప్లికేషన్‌ పెట్టుకున్నోళ్లతో కలిపితే ఆశావాహులు 11 లక్షలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పక్కఫొటోలోని వ్యక్తి పేరు గొట్టె యాదయ్య. ఈయనది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇంజాపూర్‌. అనారోగ్య సమస్యలతో ఏడాది కిందట ఉస్మానియా ఆస్పత్రిలో కుడికాలును వైద్యులు తీసేశారు. దీంతో ఆయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇద్దరు ఆడబిడ్డల పెండ్లిండ్లకు చేసిన ఏడెనిమిది లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితి. భార్య సంపాదనతోనే కుటుంబం గడవడమూ కష్టమవుతున్నది. ఇంతటి కష్టకాలంలో సర్కారు 'ఆసరా' అయినా దక్కకపోతుందా? అనే ఆశతో ఒంటికాలుతో శక్తినంతా కూడదీసుకుంటూ ఆయన ఎక్కని ఆఫీసు మెట్లు లేవు. వేడుకోని అధికారీ లేడు. మండలాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక మూడుసార్లు కలెక్టరేట్‌ గడపా తట్టాడు. కలెక్టరూ 'త్వరలోనే వస్తుంది' చెప్పి పంపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కాడ్కిపోతే 'పింఛన్‌ వచ్చేలా చూడండి' అంటూ లెటర్‌ప్యాడ్‌ రాసిచ్చి అధికారులను కలవండి అని చెప్పారు. పక్క ఊరు తుర్కయంజాల్‌కు మంత్రులు కే.తారకరామారావు, సబితాఇంద్రారెడ్డి వచ్చారని తెలిస్తే వారివద్దకూ పోయి మొరపెటు ్టకున్నాడు. 'ఆ బాబారు ఎట్టుంది? ఫస్టు నుంచి పింఛన్‌ వస్తుందిలే..' అని కేటీఆర్‌ హామీనిచ్చారంట. మంత్రి సబితాఇంద్రారెడ్డి కాగితాలనూ తీసుకుని పోయిందంట. ఇలా కనిపించినోళ్లకల్లా మొరపెట్టుకున్నా నేటికీ పింఛన్‌ అందితే ఒట్టు. ఆయన ధైన్యస్థితి చూసినవాళ్లెవరైనా అయ్యో అనోటోళ్లే. ఇగొస్తది..అగొస్తది అని చెప్పినోల్లేగానీ 'ఆసరా' మాత్రం చూపలేదు. మరె మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారమైనా మార్చి ఒకటో తేదీ నుంచి పింఛన్‌ వస్తుందేమో చూడాలి.
   పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో పడుతున్న బాధలేంటో చెప్పటానికి యాదయ్య ఒక్క ఉదహరణ చాలు. ఇలాంటివి కోకొల్లలు. ప్రతి సోమవారమూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ 'ఎప్పుడొస్తుంది' సారూ అని పదే పదే అడుగుతుండటం...అధికారులు చికాకు పడటం షరామామూలైపోయింది. అయినా, పదేపదే మొరపెట్టుకుంటేనైనా పింఛన్‌ వస్తుందనే ఆశతో ఆశావాహులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర సర్కారేమో నిధులను విదల్చట్లేదు. ప్రభుత్వం ఇప్పటివరకూ పది కేటగిరీల్లో (వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ రోగులు, బోధకాలు, కళాకారులు) పింఛన్లను ఇస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారు 36.40 లక్షల వరకు ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా 2018 ముందస్తు ఎన్నికల తర్వాత కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు కాలేదు. 65 ఏండ్లకుపైబడినవారు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హత కలినవారు 3.15 లక్షల మందికిపైగా ఉన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వితంతువులే 1,59,452 మంది ఉన్నట్టు సెర్ప్‌ సమాచారం ఇచ్చింది. వీరంతా పింఛన్‌కు అర్హులని రాష్ట్ర సర్కారు కూడా తేల్చింది. కానీ, బడ్జెట్‌లోనే వీరికి కేటాయింపులు చేయడం లేదు. అందులో వికలాంగులు 55,619 మంది ఉన్నారు. వీరంతా సొంతపనులు చేసుకోనివారు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నవారే. వీరికి కూడా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. సెర్ప్‌ గణాంకాల ప్రకారం రాష్ట్ర సర్కారు తాత్సారం చేస్తూ ప్రతినెలా 16.77 కోట్ల రూపాయలను మిగిల్చుకుంటున్నదని తేలింది. 2019 నుంచి 65 ఏండ్లకు పైబడి అర్హులైన వృద్ధులకు, ఇతరులకు ప్రతి నెలా రూ.52.34 కోట్ల పింఛన్లను ఇవ్వట్లేదు. మొత్తంగా కొత్త పింఛన్లను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.69.11 కోట్లను ఇతరత్రా అవసరాలకు వాడుకుంటున్నదని తేటతెల్లమవుతున్నది. వాస్తవానికి ఎవరైనా చనిపోయినా, అనర్హులను జాబితా నుంచి తొలగించినా కొత్తగా ఆస్థానంలో వేరే వారికి ఆ పింఛన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఆ పనినీ విస్మరిస్తున్నది. ముందస్తు ఎన్నికల తర్వాత మూడు బడ్జెట్లలో కొత్త పింఛన్ల మంజూరవుతాయని ఆశించిన వారికి ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఇగో ఈ బడ్జెట్‌లో పెడతాం...ఇగ ఈసారి వచ్చినట్టే అని పలు వేదికలపై మంత్రులు చెబుతున్నప్పటికీ ఆశావాహుల కల మాత్రం నెరవేరడం లేదు. 'నల్లగొండ జిల్లా చండూరు మండలం తేరట్‌పల్లి ఒక్క గ్రామంలోనే 40మందికిపైగా వితంతువులు పింఛన్ల కోసం అర్జీ పెట్టుకుని కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు' అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొట్ట శివ తెలిపారు.
   65 ఏండ్లే కాదు 57 ఏండ్లున్నవారికీ పింఛన్‌ ఇస్తామని రాష్ట్ర సర్కారు 2020 మార్చి ఎనిమిదో తేదీన ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10,84,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 57 నుంచి 65 ఏండ్ల మధ్యలో ఉన్నవారు. రమారమి ఎనిమిది లక్షల మందిదాకా ఉన్నారు. మిగతావారు ఇతర విభాగాల వారున్నారు. వీరు కూడా దరఖాస్తు చేసుకుని పింఛన్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అప్రూవల్‌ అయినప్పటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్లనే కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని ఉన్నతాధికారులే చెబుతున్నారు. అందరికీ పింఛన్లు ఇస్తే ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందనే కారణంతోనే రాష్ట్ర సర్కారు నాన్చుతుందనే విమర్శ వస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.