Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీవో అధ్యక్షురాలు మమత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులందరూ నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని టీజీవో అధ్యక్షురాలు వి మమత అన్నారు. వివిధ గెజిటెడ్ సంఘాల ఫోరంలో మమతను నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు శనివారం హైదరాబాద్‌లో కలిశారు. మత్స్యశాఖ, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యా శాఖ, ఇంటర్మీడియెట్ విద్యాఫోరం అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారా యణ, నగర అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, కమర్షియల్ ట్యాక్స్ అధ్యక్షులు బి వెంకటయ్య, నాయకులు టి లక్ష్మణ్‌గౌడ్, మల్లేశం, చరితారెడ్డి, లక్ష్మారెడ్డి, పద్మలత పాల్గొన్నారు.