Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్లీజ్‌..వివరాలు చెప్పండి..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2022

ప్లీజ్‌..వివరాలు చెప్పండి..!

- గర్భిణులను వేడుకుంటున్న ఏఎన్‌ఎంలు
- మూడు నెలల్లోపు గుర్తిస్తేనే కేసీఆర్‌ కిట్‌
- టార్గెట్‌ పేరుతో వేధిస్తున్న అధికారులు
- ఖమ్మం జిల్లాలో 72 మందికి మెమోలు, ఇద్దరిపై వేటు
- సహజ ప్రసవాల విషయంలోనూ నర్సులే బాధితులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'ప్లీజ్‌.. చెప్పండి..!' అంటూ గర్భిణులను వేడుకుంటున్నారు ఏఎన్‌ఎంలు. సకాలంలో గర్భిణులను గుర్తించి కేసీఆర్‌ పోర్టల్‌లో నమోదు చేయడం నర్సులకు తలకు మించిన భారంగా మారింది. తమ పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణీ మహిళలను మూడు నెలల్లోపు అంటే 12వారాల్లోగా గుర్తించాలి. ఈ సమయంలోగా గుర్తించకపోతే సంబంధిత స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందినా కేసీఆర్‌ కిట్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. 12 వారాలకు మించి ఒకరోజు ఆలస్యమైనా ఆన్‌లైన్‌ నమోదు సాధ్యం కాదు.
   కానీ కొందరు గర్భవిచ్ఛితిపై అనుమానంతో 12 వారాల వరకు బయటకు వెల్లడించేందుకు సంకోచిస్తున్నారు. ఈ కారణంగా సకాలంలో గర్భిణులను గుర్తించడం ఏఎన్‌ఎంలకు ఇబ్బందిగా పరిణమించింది. అటు వ్యాక్సినేషన్‌, కరోనా టెస్టులు, గర్భిణుల ఫాలోఅప్‌, కేసీఆర్‌ కిట్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, వైద్యపరంగా ఇతరత్రా విధులు కూడా ఏఎన్‌ఎంలే నిర్వర్తించాల్సి రావడంతో పనిభారంతో సతమతమవుతున్నారు. అధికారులేమో టార్గెట్‌ పేరుతో వెంటపడుతున్నారు.
సహజ ప్రసవాల పేరుతో మరో చిక్కు
   సహజ ప్రసవాల పేరుతో ఏఎన్‌ఎంలకు మరో చిక్కు వచ్చిపడింది. సాధారణ ప్రసవాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఈ విషయంపై హుకుం జారీ చేశారు. నాటి నుంచి కలెక్టర్‌ సహా ఇతర అధికారులు దీనిపై దృష్టి సారించారు. గర్భిణులను గుర్తించి సహజ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడం, గర్భిణుల పేర్లను రిజిస్టర్‌ చేయడం, వారికి యాంటీ నాటల్‌ పరీక్షలు (ఏఎన్‌సీ) చేయించడం, ప్రసవం అయ్యే వరకు పర్యవేక్షించడం ఏఎన్‌ఎంల విధి. ఖమ్మం జిల్లాలో 372 మంది ఏఎన్‌ఎంలు ఉండగా.. ఈ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని 72 మందికి మెమోలు జారీ చేశారు. ఇద్దరు కోఆర్డినేటర్లనూ సస్పెండ్‌ చేశారు. ఖమ్మంలోని వెంకటేశ్వరానగర్‌, శ్రీనివాసనగర్‌ పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే ఈ ఇద్దరు కోఆర్డినేటర్లు ఏఎన్‌సీ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్‌ శనివారం నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్‌లో ప్రస్తావించారు.
   రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఖమ్మంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురికి ఇక్కడి ఆధార్‌కార్డులు లేవు. తద్వారా కేసీఆర్‌ పోర్టల్‌లో ఆధార్‌, బ్యాంక్‌ ఖాతానంబర్‌, ఫొటో వివరాలు ఆన్‌లైన్‌ కాలేదు. ఇదే విషయాన్ని పేర్కొనడంతో వీరిపై వేటు వేశారు. ఖమ్మం జిల్లాలో శనివారం వస్తుందంటే రివ్యూమీటింగ్‌ భయం పట్టుకుంటోంది.
ప్రభుత్వ వైఫల్యానికి ఏఎన్‌ఎంలు బాధ్యులా...?
   ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసౌకర్యాలపై నమ్మకం కలిగించడంలో సర్కారు వైఫల్యం చెందింది. తెలంగాణలో ఏటా ఆరు లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 15వేల వరకు ప్రసవాలు అవుతుండగా, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో 8 వేల మంది వరకు డెలివరీ అవుతున్నారు. ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు గర్భిణులకు అవగాహన కల్పించి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపుతున్నారు. కొన్నిచోట్ల వైద్య సిబ్బంది సరిగా స్పందించక దూరప్రాంతాలకు రిఫర్‌ చేస్తుండటంతో గర్భిణులు ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. పైగా అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండటం లేదు. జిల్లాలో 30 పీహెచ్‌సీలు ఉండగా, వీటిలో రౌండ్‌ దీ క్లాక్‌ హాస్పిటల్స్‌ పదింటిలో మాత్రమే డెలివరీలు చేస్తున్నారు. వీటిలో అనేక చోట్ల గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న డాక్టర్లలోనూ పలువురు ప్రయివేట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండటంతో గంటల తరబడి వేచివుండి సహజ ప్రసవాలు చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణ ఉంది. నార్మల్‌ డెలివరీకి ఒక్కోసారి పది నుంచి 18 గంటల వరకు వేచివుండాల్సి రావడంతో అటు డాక్టర్లు, ఇటు పేషెంట్‌ తరఫువారు సహజ ప్రసవాలకు అంతగా మొగ్గుచూపడం లేదు. 2020-21లో రాష్ట్రవ్యాప్తంగా 6,35,041 మంది గర్భిణులు కేసీఆర్‌ కిట్‌లో రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో నాలుగో ఏఎన్‌సీ నాటికి 4,29,028 మంది మాత్రమే చెకప్‌ చేయించుకున్నారు. 2021-22లో 5,20,200 మందికిగాను చివరి ఏఎన్‌సీ నాటికి 3,60,075 మందే మిగిలారు. వీరిలో 2,48,449 మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. అయితే కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టక ముందు 35శాతం లోపు ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవి. ప్రస్తుతం 54.5శాతం ప్రసవాలు సర్కారు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పోర్టల్‌లో నమోదై ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే మగపిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడపిల్లైతే రూ.13వేలు పారితోషికంగా ఇస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. అయితే వీరిలోనూ 50శాతానికి పైగా సిజేరియన్‌ అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. వీటన్నింటికీ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్‌ఎంలను బాధ్యులను చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏఎన్‌ఎంలను బాధ్యులను చేయడం సరికాదు
కళ్యాణం వెంకటేశ్వరరావు- సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి
   ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించి సర్కారు దవాఖానలపై నమ్మకం కలిగించాలి. అంతేకానీ క్షేత్రస్థాయి ఏఎన్‌ఎంలను దీనికి బాధ్యులను చేసి మెమోలు ఇవ్వడం సరికాదు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే గర్భిణులు రావడం లేదు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేసి, సౌకర్యాలు మెరుగుపరిచాలి కానీ ఏఎన్‌ఎంలపై చర్యలు తీసుకుంటే ఉపయోగం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.