Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తిదారుల సమన్వయ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి తగిన విధంగా నిధులు కేటాయించ లేదని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి కన్వీనర్ ఎంవి రమణ సోమవార ం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.5,698 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను, వృత్తిదారులను ప్రభుత్వం చిన్న చూపు చూసిందని విమర్శిం చారు. బడ్జెట్‌లో వృత్తిదారుల కార్పొరేషన్, ఫెడరేషన్‌లకు, బీసీల ఉపకార వేతనాల కోసం కనీసం రూ. 25 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. దీన్ని బట్టి వృత్తిదారుల అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతున్న దని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇవి ఎంత మాత్రం సరిపోవని తెలిపారు.