Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు గురువారం హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. 61 రోజులుగా జైల్లో ఉన్న రాఘవపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత ప్రకటించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోకి వెళ్లరాదని, ప్రతి శనివారం ఖమ్మం వన్‌టౌన్ పీఎస్‌లో హాజరుకావాలని, బెయిల్ పొందాక సాక్షులను ప్రభావితం చేయరాదని, బెదిరించరాదని షరతులు విధించింది.
క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇస్తే.. సీఎస్ కేసులోనూ ఇస్తాం..: హైకోర్టు
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాలను ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి విషయంలోనే ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ నుంచి రిలీవ్ చేసిన తర్వాత ఏడెనిమిది నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సర్వీసులోకి తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. సీఎస్ సోమేష్‌కుమార్, మరో 16 మంది కేంద్ర సర్వీస్ అఫీసర్లు క్యాట్ ఆదేశాలతో కొనసాగుతున్నారని, మహంతి విషయంలో మాత్రం క్యాట్ ఆదేశాల్ని అమలు చేయలేదని ఆక్షేపించింది. క్యాట్‌లో మహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో ఈ నెల 11న స్వయంగా సీఎస్ హాజరుకావాలన్న ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించింది.