Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ సరఫరా చేసే ఏజెన్సీల్లో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రులకు పోషకాహారాన్ని అందించే ఏజెన్సీలకు ఇది వర్తిస్తుంది. ఇక మీదట ఎస్సీల యాజమాన్యంలోని ఏజెన్సీలకు 16 శాతం కచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది. 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానాలకు రిజర్వేషన్ వర్తింపజేసింది. ఇందు కోసం ఆస్పత్రులను రెండు కేటగిరీలుగా విభజించింది. 100 వరకు బెడ్లు ఉన్న వాటిని ఆస్పత్రులను ఏ కేటగిరిగా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటళ్లను బి కేటగిరిగా నిర్ధారించింది. ఏ హాస్పిటల్లో రిజర్వేషన్ ఆస్పత్రుల్లో కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారిస్తారు. కనీస టర్నోవర్‌ను 50 శాతం తగ్గించాలి. రిజర్వ్‌డ్ ఆస్పత్రికి ఒక్క బిడ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కటి రాకపోతే మరోసారి టెండర్ ఆహ్వానించాలి. అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్ టెండర్లు పిలువాలని నిబంధనలు విధించారు.