Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొంగకూ కోతి చింత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 14,2022

కొంగకూ కోతి చింత

- విదేశీ విహంగం లేక వలస పక్షుల కేంద్రం వెలవెల
- సైబిరియన్‌ అతిథి లేక చిన్నబోయిన చింతపల్లి
- కోతుల బెడదతో చెట్లు కొడితే 'కొంగమ్మ'కు తిప్పలు
- గూడుకు చోటు లేక ఊరంతా తిరిగివెళ్తున్న పైలట్లు
- 150 ఏండ్లలో మూడోసారి ఆ ఊరుకు రాని కొంగ
కోతుల బెంగ కొంగకు తిప్పలు తెచ్చిపెట్టింది. ఊళ్లో...చేలలో ఉన్న చింతచెట్లతో పాటు భారీ వృక్షాలను నరికి వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖమ్మం జిల్లాలోని విదేశీ వలస పక్షుల కేంద్రం చింతపల్లి వెలవెలబోతోంది. జనవరి నుంచి జూలై వరకు ఇక్కడే కాపురం చేసే సైబిరియన్‌ చుట్టాలు గూడుపెట్టే చోటు లేక గుండె చెదిరి వెళ్తున్నాయి.
(చింతపల్లి నుంచి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి)

             గాలిలో ఈదుకుంటూ...గంగపై ఉరుకుతుండే కొంగమ్మ వేల కిలోమీటర్లు పయనించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలోని ఖమ్మం రూరల్‌ మండలం చింతపల్లికి చేరుతుంటాయి. ప్రతియేటా డిసెంబర్‌ నుంచి పైలట్‌ కొంగలు వచ్చి ఊరు ఊరంతా చుట్టి వెళ్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో అధ్యయనం చేస్తాయి. అంతా సవ్యంగా ఉందనుకుంటే జనవరిలో సైబిరియా నుంచి తోటి కొంగలను తోడ్కొని వస్తాయి. ఎర్రటి కాళ్లు..పొడవాటి ముక్కు... ఐదు నుంచి పది కిలోల పరిమాణం... ఆకర్షనీయమైన రూపంతో ఉండే ఈ కొంగ బంధు గణాన్ని ఒకప్పుడు గ్రామస్తులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించే వారు... అల్లారుముద్దుగా చూసుకునే వారు. ఎవరైనా హాని చేయాలని ప్రయత్నిస్తే రూ.500 జరిమానా కూడా వేసేవారు. సుమారు 150 ఏళ్ల నుంచి కొంగలు జంటగా రావడం...జూన్‌, జూలైలో పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వెళ్లడం ఆనవాయితీ. కొంగలున్నన్ని రోజులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే సందర్శకులతో ఊళ్లో సందడి నెలకొనేది. కానీ కొంతకాలంగా వానర సేన దండయాత్ర చేస్తోంది. గ్రామస్తులు కోతులతో వేగలేక ఇంటికి ఒకటి, రెండుగా ఉన్న చింత, వేప, ఇతరత్ర చెట్లను నరికి వేస్తున్నారు. కోతులను పారదోలేందుకు టపాసులు పేల్చుతున్నారు. ఈ శబ్దం తాకిడికి పక్షులు సైతం చెల్లాచెదురవుతున్నాయి. గూట్లో ఉన్న కొంగ పిల్లల గుండెలదురుతున్నాయి. భయాందోళనతో చెట్ల పైనుంచి కిందపడి చనిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుడ్లను కోతులు భక్షిస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కోతి చేష్టల ముందు కొంగమ్మ తలవంచక..., గూడు చెదిరి గుడ్డు నేలపాలు కాక తప్పట్లేదు. ఈ పరిణామాలతో భీతిల్లిన సైబిరియన్‌ కొంగలు పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాయి. తమకు ఎదురవుతున్న గడ్డు స్థితిగతులపై ఆందోళన చెందుతున్నట్లున్నాయి. ఈ ఊళ్లో అడుగుపెట్టలేక పొరుగూళ్ల కోసం అన్వేషిస్తున్నాయి.
ఇలా మూడోసారి...
             సైబిరియన్‌ కొంగలకు ఇప్పటికీ దాదాపు 150 ఏళ్లుగా చింతపల్లి ఆశ్రయం ఇస్తోంది. ఇన్నేళ్లలో ఆ ఊరుకు కొంగలు రాని సందర్భాలు మూడు, నాలుగు సార్లకు మించ లేదు. కరువు కాటకాలు సంభవిస్తున్న సమయంలో తప్ప గ్రామంలోకి 'అతిథులు' అడుగుపెట్టని సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు కేవలం కోతుల కారణంగా కొంగలు రాని పరిస్థితి దాపురించింది. జనవరిలో రావాల్సిన విహంగాలు మూడునెలలైనా రాకపోవడంతో చింతిస్తున్నారు. గతేడాది మంకీ క్యాచర్స్‌ ద్వారా కోతులను పట్టించేందుకు అటవీశాఖ అధికారులు పయ్రత్నించినా అదీ విఫలయత్నమే అయింది. ఖమ్మం జిల్లాలో కోతుల బెడద ఎంత తీవ్రంగా ఉందో తెలిపేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సందర్శకులకు కొంగలను చూపించి ఆనందానుభూతి నింపేందుకు అటవీశాఖ ఓ గైడ్‌ను సైతం ఏర్పాటు చేసింది. కోతులతో కొంగలు రాకపోవడంతో ఈ వలస పక్షి కేంద్రం వృథాగా మిగిలి ఉంది. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 2.50 లక్షలకు పైగా కోతులున్నాయి. 2,000 పైగా కోతుల సమూహాలుండగా వీటిలో ఖమ్మం రూరల్‌లోనే 138 వరకు ఉన్నాయి. 11వేలకు పైగా కోతులు మండలంలో సంచరిస్తుండగా చింతపల్లిలో సుమారు 1500 వరకు ఉన్నట్లు అంచనా. ఫలితంగానే వలస పక్షుల కేంద్రం ఈ ఏడాది కొంగలు లేక బెంగటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
కొంగ అరుపులతో మేల్కొనేవాళ్లం...
దేవిశెట్టి లక్ష్మీనారాయణ, చింతపల్లి
             అన్ని ఊర్లు కోడి కూతతో నిద్రలేస్తాయి. కానీ మా ఊరు జనవరి నుంచి జూన్‌, జులై వరకు కొంగ అరుపులతో మేల్కనేది. మాతాతల కాలం నుంచి ఊరుకొచ్చే కొంగ ఈ ఏడాది రాకపోయే సరికి దిగులుగా ఉంది. ఒకప్పుడు కొంగలను వేటాడేందుకు కొందరు తుపాకులు పట్టుకుని వచ్చేవారు. వారు కంటపడితే ఊరుఊరంతా పొలిమెర దాటించేది. ఏ ఒక్క కొంగకూ హాని జరగకుండా చూసుకునేవాళ్లం. నాకు ఇప్పుడు 75 ఏళ్లు. నా ఊహ తెలిసిన కానుంచి మావూరు కొంగలు రాకుండా ఉండటం ఇది మూడోసారి. అప్పుడప్పుడు వచ్చి కొంగలు చూసిపోతన్నయి గానీ ఇంతకుముందులా గూళ్లు, గుడ్లు పెట్టి పిల్లలను చేయట్లేదు. 2002-03 ఏడాది అనుకుంటా కరువు రోజుల్లోనే కొంగలు రాలేదు తప్ప కోతుల బెడదతో కొంగలు రాకుండా ఉండటం ఇది మొదటిసారి.
కొట్టంలో సర్కారు చెట్టు కొంగల కోసమే కొట్టకుండా ఉంచా...
ముత్యం కృష్ణారావు, సర్పంచ్‌
             ఆ కొట్టంలో ఉన్న సర్కారు చెట్టు మీద పొయిన సంవత్సరం కొంగలు పెట్టిన గూళ్లు అలాగే ఉన్నాయి. ఈ ఏడాది కూడా వస్తాయని ఆ చెట్టు అడ్డమున్నా కొట్టకుండా ఉంచా. కొంగలు వచ్చి చూసి పోతున్నాయి గానీ ఇక్కడ ఉండట్లేదు. చెరువులో పది కొంగలు ఎగురుతూ కనిపించాయి. తెల్లారి చూస్తే కనిపించట్లేదు. కరువు లేకపోయినా కొంగలు ఉండట్లేదంటే కోతులతో వేగలేక చెట్లు నరికి వేస్తుండటమే కారణం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.