Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలో అసెంబ్లీ.. ఉద్రిక్తం
- కార్యకర్తల అరెస్ట్
నవతెలంగాణ-అడిక్‌మెట్
అర్హులందరికీ ఆసరా పెన్షన్, కొత్త రేషన్ కార్డులు, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, పోడు భూములకు పట్టాలు.. సాగుదారులపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వందలాది మందిని అరెస్టు చేసి, ఓయూ, అంబర్‌పేట, నల్లకుంట పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌ను ఆదివారం రాత్రి నుంచే పోలీసులు దిగ్బంధించారు. చలో అసెంబ్లీ పిలుపుని భగం చేయడానికి మహబూబ్‌నగర్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ తదితర జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు కేజీ రాంచందర్, రాయల చంద్రశేఖర్, ఎస్‌ఎల్ పద్మ, హన్మేష్, వి.ప్రభాకర్, నంది, రామయ్య, చిన్న చంద్రన్న, జగ్గన్న, పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ, ఐఎన్టీయూ అరుణోదయ నాయకులు ఎస్.నాగేశ్వరరావు, బి.రాము, లక్ష్మి, స్వరూప, ఝాన్సీ, మంగతాయి, ఆజాద్, సుమంత్, కె. రాజన్న, దేవరామ్, తదితర నాయకులు ఉన్నారు. ప్రజాస్వామిక ప్రదర్శన చేసుకోనివ్వకుండా అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.