Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలే సమస్యలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

సమస్యలే సమస్యలు

- కాలేజీలు ఏర్పాటు చేయండి..ఆస్పత్రులు కట్టించండి
- గంటన్నరపాటు సమస్యల్ని విన్నవించిన 40 మంది సభ్యులు
- అసెంబ్లీ జీఆరోఅవర్‌పై రాతపూర్వక సమాధానాలివ్వండి
- మంత్రులకు స్పీకర్‌ పోచారం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
              ఒకవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులందరూ విద్యా, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని శాసనసభ లోపల, బయటా అదే పనిగా ప్రకటిస్తున్నారు. అందుకు భిన్నంగా మరోవైపు అదే అధికార పార్టీకి చెందిన అత్యధిక మంది సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో కళాశాలలు కట్టించాలనీ, ఆస్పత్రులు నిర్మించాలని సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు. రెండుమూడేండ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తున్నది. తాజాగా శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ సభ్యులు ఇవే అంశాలను మరోసారి సభలో ఏకరువు పెట్టారు. తక్షణం విద్యా,వైద్య రంగాలను పటిష్టం చేయాలని వారు విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. మరోవైపు జీరో అవర్‌లో అడిగే ప్రశ్నలకు నోట్‌ చేసుకున్నాం.. పరిశీలిస్తాం.. అని చెబితే సరిపోదనీ, వాటిపై రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని మంత్రులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జీరో అవర్‌లో 40 మంది దాకా సభ్యులు తమ నియోజకవర్గాల్లోని, రాష్ట్రంలోని సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అందులో అధికార పార్టీకి చెందిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు లేక తమ నియోజకవర్గాల్లోని పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు చదువులకు దూరం అవుతున్నారనీ, కాబట్టి వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని అధికార పార్టీ సభ్యులు ఏకరువు పెట్టారు. మరికొందరు సభ్యులు పీహెచ్‌సీలు, వైద్యసౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారని సభలో ప్రస్తావించారు. ఎంఐఎం సభ్యులు పాతబస్తీలోని సమస్యలను ఎత్తిచూపారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల్ని నోట్‌ చేసుకున్నామనీ, పరిశీలిస్తామనీ, ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామనిమంత్రులు సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజరుకుమార్‌, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు సభలో చెప్పారు.
కాలేజీల కోసం మొర
              ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ జీఆరో అవర్‌లో మాట్లాడుతూ.. 'మందమర్రిలో డిగ్రీ కళాశాల పెట్టాలి. పీజీ కాలేజీ పెట్టాలి. అమ్మాయిలు వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్లలేక విద్యకు దూరం అవుతున్నారు. సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి. 44 ఎకరాల ఖాళీస్థలం కూడా ఉంది. ఆ రెండు కళాశాలలు ఏర్పాటు చేస్తే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది' అని సభకు విన్నవించారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగానూ ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదనీ, దీంతో వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని వాపోయారు. తాము లేవనెత్తిన సమస్యల్ని మంత్రులు నోట్‌ చేసుకుంటున్నామని చెబుతున్నారుగానీ పరిష్కారం కావట్లేదనీ, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు అబ్రహం మాట్లాడుతూ..తమ నియోజకవర్గంలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉందనీ, డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని చెప్పారు. ఒకవేళ దగ్గరలోని కర్నూల్‌ వెళ్లి చదివినా నాన్‌లోకల్‌ అవుతున్నారనీ, ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సభను కోరారు. సండ్రవెంకటవీరయ్య మాట్లాడుతూ..తల్లాడ, వేంసూర్‌లో ఇంటర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలనీ, సత్తుపల్లిలోని రేకుల షెడ్డులో కొనసాగుతున్న కళాశాలకు పక్కాభవనాన్ని నిర్మించాలని విన్నవించారు. సభ్యులు జాజుల సురేందర్‌ మాట్లాడుతూ..ఎల్లారెడ్డిలో ఇంటర్‌క్లా సులు ప్రారంభించాలని కోరారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని 9 మండలాలుండగా ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేకపోవడంతో ఆడబిడ్డలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల కోసం పదెకరాల భూమి ఇచ్చినా ఇప్పటికీ కళాశాల ఏర్పాటు చేయలేదనీ, వెంటనే సమస్యని పరిష్కరించాలని వేడుకున్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.
వైద్యసౌకర్యాలు లేక ఇక్కట్లు..పీహెచ్‌సీలు,
ఆస్పత్రులు ఏర్పాటు చేయించండి...
              అధికార పార్టీ సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఏజెన్సీలో గల తన నియోజకవర్గంలోని గ్రామాలు ఒకదానికొకటి చాలా దూరంగా ఉండటం సమస్యగా మారిందనీ,సరైన వైద్యసౌకర్యాలు లేక ఇప్పలపల్లి లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. తన నియోజకవర్గానికి మాతాశిశు కేంద్రాన్ని కేటాయించా లని విజ్ఞప్తి చేశారు. రెడ్యానాయక్‌ మాట్లాడుతూ..మరిపెడ మున్సిపాలిటీలో పీహెచ్‌సీ మూతబడి ఉందనీ, దీంతో వైద్యం చేయించుకోవడానికి ఖమ్మం, మహబూబాబాద్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విడమర్చి చెప్పారు. నర్సింహులపేటలో పీహెచ్‌సీ శిథిలావస్థలో ఉందనీ, భవనం మంజూరు చేయాలని కోరారు. అందులో సిబ్బందే లేరని చెప్పారు.నోముల భగత్‌ మాట్లాడు తూ..హాలియాలోని ఆస్పత్రిలో పోస్టుమార్టం కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడ అది లేకపోవడం వల్ల మృతదేహాలను నల్లగొండకు తరలించి వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. తిరుమలగిరి, పెద్దవూర పీహెచ్‌సీ సెంటర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..పోచంపల్లిలోని శిథిలావస్థలోని పీహెచ్‌సీ స్థానంలో నూతన భవనాన్ని మంజూరు చేయాలనీ, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..ఆర్‌ఎంపీ, పీఎమ్‌పీలకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా పోస్టుల్లో, వైద్యసేవల్లో రాష్ట్ర సర్కారు వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
బెటాలియన్‌ నిర్వాసితులకు న్యాయం చేయండి : సీతక్క
              కాంగ్రెస్‌ సభ్యులు డి.అనసూయ(సీతక్క) మాట్లాడుతూ..ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఐదో బెటాలియన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదనీ, దానికి ఐదొందల ఎకరాలు సేకరించగా అందులో పేదలదే 200 ఎకరాలు ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో మున్నేరు వాగుపై ఆనకట్ట కట్టాలని విన్నవించారు. దానిని పూర్తిచేస్తే ముదిగొండ, చింతకాని మండలాలకు సాగునీటి అందించొచ్చని సూచించారు. హైడ్రోలాజికల్‌, అటవీ శాఖ, ఇంటర్‌స్టేట్‌ అనుమతులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఆరోజోన్‌లో 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలకు సీఐలుగా ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదో జోన్‌లోని 2012 ఎస్‌ఐలకు సీఐలుగా ప్రమోషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఆరేండ్లు దాటితేనే ఎస్‌ఐలకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, 12 ఏండ్లు అవుతున్నా ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇతరత్రాలు..
              20వేల మందికిపైగా ఉన్న వీఆర్‌ఏలకు పేస్కేలు ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీ సభ్యులు జి.విఠల్‌రెడ్డి కోరారు.ఇంటి స్థలం వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేయాల ని సభకు విజ్ఞప్తి చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డి.శ్రీధర్‌బాబు కోరారు. మేడిగడ్డ అన్నారం నుంచి లిఫ్టుచేసే సమయంలో పలు గ్రామాల్లోని నీటి వరద పోతున్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.తమను పర్మినెంట్‌ చేయాలనీ, రిటైర్డ్‌ బెనిఫి ట్స్‌ ఇవ్వాలని అంగన్‌వాడీలు అడుగుతున్న నేపథ్యంలో వారి సమస్యను పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు గణేష్‌గుప్తా కోరారు. అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..నారాయణఖేడ్‌లో పేదలకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం అవుతున్నదనీ,దానిని కాపాడాలని సభకు విన్నవించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, సాదాబైనామాలు, ఇండ్లస్థలాల సమస్యలను పరిష్కరించాలని సభ్యులు హరిప్రియ, కాలె యాదయ్య, ఆర్‌.రమేశ్‌ కోరారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు న్యాయం చేయాలని సైదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో రహదారుల మూసివేతతో తలెత్తుతున్న సమస్యలను సివిల్‌ మిలిటరీ లైజాల్‌ కమిటీ ద్వారా పరిష్కారించాలని సభను టీఆర్‌ఎస్‌ సభ్యులు సాయన్న వేడుకున్నారు. రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ.. లారీ ఓనర్లు బ్యాంకుల నుంచి అప్పులు, లోన్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారనీ, ఏపీకి వెళ్తే ప్రతి టిప్పుకు రూ.1600 వసూలు చేయడం భారంగా మారిందని తెలిపారు. ఏపీకి వెళ్లే లారీలకు ఏడాదికి ఓ ఐదువేలు నిర్ణయించాలని సూచించారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ..నాపరాయి, శుద్ధ గనుల మైనింగ్‌ లీజ్‌లను రెన్యూవల్‌ చేయాలని విన్నవించారు. రామగుండం ఎన్టీపీసీ యాష్‌పాండ్‌తో పలు గ్రామాలు బూడిదమయం అవుతున్నాయనీ, ఆ గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. తమ నియోజకవర్గ కేంద్రానికి పాలిటెక్నిక్‌ కాలేజీ ఇవ్వాలని విన్నవించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.