Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- వ్యవసాయ విధానం రూపొందించండి : సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు అప్పులపాలై...ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యలతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందనీ, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల తాను మహబూబాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే రూ 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని కోరారు.