Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ,తలసాని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మత సామరస్యం ఉన్నదనీ, దాన్ని ఎవరూ దెబ్బతీయొద్దని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రధాన పండుగలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుపుతున్నామని చెప్పారు. రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ బండా శ్రీనివాస్, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్ బిన్ బలాల, అహ్మద్ పాషా ఖాద్రీ,జాఫర్ హుస్సేన్ మీరాజ్,ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్,పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐపీఎస్ అధికారి చౌహాన్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రమనీ, సీఎం కేసీఆర్ లౌకిక వాదని చెప్పారు. అన్ని కులాలు,మతాలను సమదృష్టితో చూస్తున్నారని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ,ముఖ్యమంత్రి ఇచ్చే విందును ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.