Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశి మిర్చి క్వింటాకు రూ.44,000
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం దేశి రకం మిర్చికి రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్వింటాల్‌కు రూ.44,000 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు సామినేని నాగేశ్వర్‌రావు మార్కెట్‌కు 66బస్తాల మిర్చి తీసుకురాగా.. ఇందిరా ఎంటర్‌ప్రైజెస్ అడ్తి ద్వారా జితిన్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారు అత్యధిక ధర రూ.44,000 పెట్టి కొనుగోలు చేశారు. ఒక్కరోజే మార్కెట్‌కు మొత్తం 15వేల బస్తాల మిర్చి రాగా, తేజ రకానికి రూ.17,600/13,000, దేశి రకం రూ.44,000/27,000, వండర్ హాట్ రకం 23,500/16,000 మధ్య ధర పలికింది.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం మార్కెట్ మొత్తం వెయ్యి బస్తాల పత్తి రాగా, క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.10,310 కాగా, కనిష్టంగా రూ.9,000 ధర పలికింది.