Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సజీవ దహనం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

సజీవ దహనం

- 11 మంది వలసకూలీల మృతి...
- సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
- హడావిడిగా పోస్టుమార్టం
- అంతా బీహార్‌కు చెందిన వారే..
పొట్ట చేతపట్టుకుని బతుకు దెరువు కోసం బస్తీకి వచ్చారు. తమకు పని ఇచ్చిన స్క్రాప్‌ దుకాణమే ప్రాణాలు తీస్తుందని వాళ్లు అనుకోలేదు. రాత్రి పడుకునే ముందు బీహార్‌ లో ఉన్న తమ బంధువులతో మాట్లాడారు. సహచర కార్మికులతో కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు అమాంతంగా మంటలు చెలరేగాయి. గేటుకు తాళం వేసి ఉండటం, మరోవైపు శారీరక బడలికతో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేదు. అంతే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆ మంటల్లోనే 11 మంది సజీవ దహనమయ్యారు. జంటనగరాల్లో భద్రత లేని బతుకులకు భరోసా ఎవరిస్తారంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట్‌
             సికింద్రాబాద్‌ బోయిగూడలోని ఓ స్క్రాప్‌ గోడౌన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి నిద్రపోయిన కార్మికుల బతుకులు తెల్లారేసరికి బుగ్గిపాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. 11 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా బీహార్‌ రాష్ట్రానికి చెందినవారే. పొట్టచేతబట్టుకొని బతుకుదెరువు కోసమని సిటీకొచ్చి బోయిగూడలోని శ్రావణి ట్రేడర్స్‌ ప్లాస్టిక్‌ గోడౌన్‌ (స్క్రాప్‌ గోడౌన్‌)లో పనిచేస్తున్నారు. గోడౌన్‌లోనే నివాసం ఉంటున్నారు. తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది నిద్రలో ప్రాణం వదిలారు. విషయం తెలియగానే మంత్రులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.
             బోయిగూడలో 'శ్రావణి ట్రేడర్స్‌' ప్లాస్టిక్‌ గోడౌన్‌ (స్క్రాప్‌గోడౌన్‌) 10 ఏండ్లుగా కొనసాగుతోంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. బుధవారం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆ సమయంలో పై అంతస్తులోని మూడు గదుల్లో 12 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. మంటలను చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. మొదట గాంధీ ఆస్పత్రిలో అందుబాటులో వున్న ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. అప్పటికే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరో 7 ఫైర్‌ ఇంజన్లను రగంలోకి దించారు. రేకుల షెడ్‌తో గోదాంను నిర్మించడం, అందులో నుంచే పైకి (ఇనుప మెట్లు) ఉండటంతో భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంది. కార్మికులు ఇనుప మెట్ల పై నుంచి కిందకు రాలేకపోయారు. దానికి తోడు భారీఎత్తున మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక కార్మికులు స్పృహకోల్పోయారు. ఆ తర్వాత 11 మంది సజీవదహనయ్యారు. మరో కార్మికుడు కిటికీలోనుంచి బయటకు దూకడంతో ప్రాణంతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్‌ ఆ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీయగలిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్నేహితునికి ఫోన్‌... ప్రాణాలతో బయటపడిన కార్మికుడు
             గోడౌన్‌లో చనిపోయిన 11 మంది కార్మికులతోపాటు ప్రేమ్‌ అనే యువకుడు కూడా ఉంటున్నాడు. మంటలు, పొగను చూసి పై అంతస్తులోని కిటికీ గ్రిల్స్‌ తొలగించి కిందకు దూకడంతో ప్రేమ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భయాందోళనకు గురైన ప్రేమ్‌ అంబర్‌పేట్‌లో నివాసముంటున్న స్నేహితుడు బర్మాదేవ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పి కొద్ది దూరంలో స్పృహకోల్పోయి పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గోదాము యజమాని సంపత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం న్యాయం చేయాలి:
బాధితుల కుటుంబసభ్యులు
మృతులంతా బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. బిట్టు(23), సికిందర్‌(40), దరోగా కమార్‌ అలియాజ్‌ దినేష్‌(35), దామోదర్‌ మహాల్‌ (27), సింటు (27), సికిందర్‌, రాజేష్‌(25), రాజు (25), దీపక్‌(26), పంకజ్‌(26), సత్యేందర్‌(40)గా గుర్తించారు. ఘటన గురించి తెలుసుకున్న బీహార్‌లోని చాప్రా జిల్లా వాసులతోపాటు హైదరాబాద్‌లో నివాసముంటున్న బాధితుల కుటుంబీకులు గాంధీ మార్చురీ వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. సత్యేందర్‌, దీపక్‌కు వివాహం అయింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది: మహమూద్‌ అలీ
             అగ్నిప్రమాద సంఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. హైదరాబాదులో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
ఘటనా స్థలానికి వచ్చిన హోంమంత్రి మహమూద్‌ అలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌తో కలిసి గోడౌన్‌ నుంచి బయటకు వచ్చిన 5 నిమిషాల్లోనే గోడౌన్‌ బీమ్‌ కుప్పకూలింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అందరినీ పంపించి వేశారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం: సీఎస్‌
             మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రమాద ఘటన దురదృష్టకరం: మంత్రి తలసాని
అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని మంత్రి తలసాని అన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.
3:55 నిమిషాలకు ఫోన్‌ వచ్చింది
             ఉదయం 3:55 నిమిషాలకు ఫోన్‌ వచ్చిందని జిల్లా ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గోదాంలో అగ్నిప్రమాదం సంభవించిందని మనోహర్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పారన్నారు. వెంటనే తాము గాంధీ ఆస్పత్రిలోని ఫైర్‌ ఇంజన్లను రంగంలోకి దించామన్నారు. ముషీరాబాద్‌, సెక్రటేరియట్‌, గౌలిగూడ, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో 8 ఫైర్‌ ఇంజలను రంగంలోకి దించామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఎండాకాలం కావడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
గోడౌన్‌లో ప్రమాద నివారణ చర్యల్లేవు : సీపీ
             స్క్రాప్‌ గోదాం నిర్వహణ సరిగ్గా లేదని, ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్టు 100కు ఫోన్‌కాల్‌ వచ్చిందని చెప్పారు. సిలిండర్‌ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయని చెప్పారు. కింద ఫ్లోర్‌లో తుక్కుసామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు. ప్రేమ్‌ అనే యువకుడు పైనుంచి దూకి ప్రాణంతో బయటపడ్డాడన్నారు. మృతులు బీహార్‌లోని చాప్రా జిల్లాకు చెందినవారని తెలిపారు.
పట్టించుకోని అధికారులు : స్థానికుడు శైలేందర్‌
             బోయిగూడలో 50కిపైగా గోదాంలు, టింబర్‌ డిపోలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. గతేడాది సైతం ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది తీవ్రంగా నష్టం వాటిల్లింది. పర్మీషన్‌ లేకుండానే గోడౌడ్లు, టింబర్‌ డిపోలు కొనసాగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు మామూలుగానే మారిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం 4 టీమ్‌లు
             గాంధీ మార్చురీలో బోయిగూడ అగ్నిప్రమాద మృత దేహాల గుర్తింపు, డెడ్‌ బాడీలు పాడవకుండా ఎంబామింగ్‌, పోస్టుమార్టం మూడు ప్రక్రియలను ఏకకాలంలో వైద్యులు చేపట్టారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగు టీంలు పాల్గొన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌, సీపీ సీవీ ఆనంద్‌ పర్యవేక్షిస్తున్నారు.
యజమాని నిర్లక్ష్యమే : ప్రేమ్‌కుమార్‌
             స్క్రాప్‌ గోడౌన్‌ యజమాని నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని ఆ ఘటన నుంచి తప్పించుకుని ప్రాణంతో బయటపడిన ప్రేమ్‌కుమార్‌ తెలిపాడు. తాను రెండేండ్లుగా గోదాంలోనే పనిచేస్తున్నానని, తనతో పాటు 11 మంది గోదాం పై అంతస్తులో నిద్రపోయామని చెప్పాడు. చిన్న రూమ్‌లో తాను, బిట్టు, పంకజ్‌ ఉన్నామని, మరో రూమ్‌లో మిగతా 9 మంది కార్మికులు పడుకున్నారని చెప్పాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పొగలతో మంటలు వచ్చాయని, బయటకు వెళ్లేందుకు ప్రయత్నిం చామని, కానీ మంటలు పెద్దఎత్తున వ్యాపించాయని అన్నాడు. తాను కిటికీలోంచి బయటకు దూకానన్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని తెలిపాడు. అప్పటికే తన తోటి వాళ్లంతా చనిపోయార న్నాడు. ప్రేమ్‌కుమార్‌ ఫిర్యాదుతో బోయిగూడ అగ్నిప్రమాదంలో స్క్రాప్‌ యజమాని సంపత్‌పై 304 ఏ, 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.