Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుదలపై నిరసన
- ధర్నాలు చేసిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ-బేగంపేట్/ మొఫసిల్‌యంత్రాంగం
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ దేశ ప్రజల కష్టాలకు కారణమవుతున్న మోడీ సర్కారును కూకటివేళ్లతో కూల్చితేనే మేలు జరుగుతుందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బేగంపేటలోని సివిల్ సప్లరు ఆఫీసు ఎదుట ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేసే పని ఒక్కటీ చేయడం లేదన్నారు. చట్టం, రాజ్యాంగపరంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనాల్సిన కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలంగాణలో సింగరేణితోపాటు ఏపీలో విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికాగానే మోడీ సర్కార్ ప్రజలపై పగబట్టిందన్నారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు ధర్నాలు చేయాల్సిన అవసరం రాలేదు కానీ మోడీ సర్కార్ పుణ్యమా అని ఇప్పుడు రైతులు, గిరిజనులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కేంద్రం తీరు మారకపోతే, తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
జిల్లాల్లో నిరసనలు ..
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వంట గ్యాస్ వెయ్యి రూపాయలు చేశారని, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆధ్యర్యంలోనూ భైంసాలో నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిలిండర్లతో నిరసన తెలిపారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. అలాగే జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెపునకు నిరసనగా నల్లగొండ జిల్లా దేవరకొండ, చండూరు, నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాలోని మోత్కూర్, ఆలేరు, ఆత్మకూర్‌ఎం, భువనగిరిలో టీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు వేర్వేగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు ఆటోకు తాళ్లు కట్టి తాగుతూ నిరసన తెలిపారు. మణుగూరులో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేశారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడీలో సీఐటీయూ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.